ASF : ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో ఆవశ్యకం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాస్వామ్యంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ఓటు హక్కు ఎంతో ఆవశ్యకత కలిగి ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి తో కలిసి జిల్లా అధికారులతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుండి ప్రారంభమై జనకాపూర్, కొమురం భీమ్ చౌక్, అంబేద్కర్ చౌక్లమీదుగా తిరిగి కలెక్టరేట్ భవనానికి బైక్ ర్యాలీ నిర్వహించి జిల్లా అధికారులతో, ఉద్యోగులతో జాతీయ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును శాంతియుత, ప్రశాంత వాతావరణంలో కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత విభేదాలు లేకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. ఓటు ఆవశ్యకత, విలువ తెలుసుకొని అభివృద్ధికి దోహదపడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. అనంతరం సీనియర్ ఓటర్లు అయిన వైరాగడ శంకర్, తుకారం, లక్ష్మి, భూదేవి, నూతనంగా ఓటు నమోదు చేసుకున్న నిహారిక, దేవేందర్ లను శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్, జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post