ASF : ప్రభుత్వరంగ  బ్యాంకులు రుణ లక్ష్యాన్ని చేరుకోవాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులకు ఇవ్వాల్సిన రుణ లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి బ్యాంకుల రుణ లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకర్ల రుణ లక్ష్యం 1492 కోట్లు లక్ష్యంగా నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో ఎస్బిఐ 73 కోట్లు రుణాలు అందజేసిందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 46 శాతం మీద రుణాలు అందజేసిందన్నారు. ఈ మొత్తం ప్రైవేట్ బ్యాంకులైన హెచ్.డి.ఎఫ్.సి., ఐసిఐసిఐ లాంటి వాటితో పోల్చినప్పుడు తక్కువగా ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల లింకేజీ రుణాలు 169 కోట్లు కాగా 170 కోట్లు అందజేసినట్లు తెలిపారు. మిగిలి ఉన్న మహిళా సంఘాలకు అవసరమైన రుణాలు మంజూరు చేయాలన్నారు. రుణాలు అందించడంలో సంక్షేమ శాఖలు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు ఎస్సీ సంక్షేమ శాఖలో రుణాల మంజూరు పెండింగ్ వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు డైరీ ఫారాలు ఏర్పాటు చేసేలా అవగాహన కల్పించి వాటికి రుణాలు అందించి పాల ఉత్పత్తులు పెంచాలన్నారు ప్రైవేటు ఉద్యోగులకు ఎస్బిఐ ద్వారా గృహ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వికలాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు అవసరమైన శరణాల మంజూరు చేసే విధంగా చూడాలన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ పంట రుణాలు రైతుబంధు లాంటి రుణాలు మహిళలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్డీఎం కోవ హనుమంతు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని మణెమ్మ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కొమరం భీం ఆసిఫాబాద్ చే జారి చేయబడినది.

Share This Post