ASF : ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలను అర్హులకు అందే విధంగా చర్యలు : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి


ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలను అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో కంటి వెలుగు, జి. ఓ. నం.58, 59, 76, అర్బన్ హౌసింగ్, పోడు పట్టాలు, అగ్ని ప్రమాదాల నివారణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాల ఫలాలు అందేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ రావు మాట్లాడుతూ ప్రజల కంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు రీడింగ్ అద్దాలు ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందించడం జరుగుతుందని, జిల్లాలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాలను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన మహిళ ఆరోగ్య కేంద్రాలలో భాగంగా జిల్లాలోని తిర్యాణి మండలం గిన్నెదరి, దహేగాం మండల కేంద్రాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటుచేసిన మహిళ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి మంగళవారం మహిళలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. జీవో నెంబర్ 59 క్రింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హత గల వారికి కన్వెన్షన్ డీడ్ చేయడంతో పాటు జీవో నెంబర్ 58 కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హులకు పట్టాలు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అర్బన్ హౌసింగ్ కార్యక్రమంలో భాగంగా అర్హులకు ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రియ వయసపెట్టిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హులైన వారిని గుర్తించి పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేసవికాలం సమీపిస్తున్నందున జిల్లాలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. షాపింగ్ మాల్స్, గోదాములు, సినిమా హాళ్లు, విద్యాసంస్థలలో అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాల లక్ష్యాలను సాధించే దిశగా అధికారులతో కలిసి కృషి చేస్తున్నామని తెలిపారు. డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలలో అన్ని సౌకర్యాలు కల్పించి వినియోగించుకునే దిశగా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతులు అభివృద్ధి చెందేందుకు ఆయిల్ ఫామ్ సాగు దిశగా ప్రోత్సహించడం జరుగుతుందని, జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మణెమ్మ, జిల్లా విద్యాధికారి అశోక్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ అంజయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది.

Share This Post