ASF : మన ఊరు మన బడి పనులు పకడ్బందీగా చేయాలి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ దేవసేనల తో కలిసి జిల్లా కలెక్టర్లు, అధికారులతో మన ఊరు మనబడి పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ఊరి మనబడి పనులు పకడ్బందీగా చేయాలన్నారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేస్తున్నట్లు వివరించారు. మండలంలో రెండు పాఠశాలల చొప్పున అభివృద్ధి చేస్తున్నామన్నారు. వసతులు కల్పన పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా విద్యాధికారి అశోక్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కొమరం భీమ్ ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post