ASF : మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని,  ఇందు కొరకు సంపద సృష్టించే కార్యక్రమాలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బెలూన్ థియేటర్ ప్రారంభించి మంగళవారం నాటికి 200 రోజులు పూర్తి అయిన సందర్భంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో థియేటర్లో ఏర్పాటు చేసిన వేడుకలకు అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలసి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మహిళా సమాఖ్య సినిమాటోగ్రఫీ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయల వ్యయంతో 120 మంది కూర్చునే విధంగా జిల్లా కేంద్రంలో పిక్చర్ ట్యూబ్ థియేటర్ నిర్మించడం వల్ల ప్రజలకు ఆహ్లాదం అందుబాటులోకి వచ్చిందన్నారు. సినిమాహాల్ ప్రాంతాన్ని వినోదపుహబ్ గా రూపొందించాడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. దీనిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని ఆర్థిక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి మరింత అభివృద్ది చెందాలన్నారు. అనంతరం సినిమా థియేటర్లో మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చిరుధాన్యాలను ప్రాసెస్ చేసే ఉత్పత్తి కేంద్రం 15 రోజుల్లో అందుబాటులోకి రావాలన్నారు. వాంకిడిలో నిర్వహిస్తున్న తేనె శుద్ధి కర్మాగారం లో మంచి బాటిల్స్ వాడాలన్నారు. అలాగే దాల్ మిల్ ప్రారంభించాలని సూచించారు. జైనుర్ లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. తిర్యానీలో పేపర్ ప్లేట్లు తయారు చేసే విధంగా చూడాలన్నారు. రెబ్బెనలో పచ్చడి తయారు కేంద్రం అభివృద్ధి చేయాలన్నారు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల్లో చేస్తున్న పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ మాట్లాడుతూ తమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. చిరుదాన్యాల ఉత్పత్తి కేంద్రం మరింత అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో  అసిస్టంట్ పిడి శ్రీనివాస్, డిపివో రామకృష్ణ, ఐకెపి సిబ్బంది రమేశ్, మహిళ సంఘాల ప్రతినిధులు, సంభందిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి- కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

 

Share This Post