ASF : మహిళా సంఘాల బలోపేతానికి పూర్తి స్థాయి చర్యలు: జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు


జిల్లాలో మహిళా సంఘాల బలోపేతానికి సంబంధిత శాఖల సమన్వయంతో పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా సమైక్య సంయుక్త ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నాన్ ఓన్ బ్యాగుల తయారీ యంత్రం, 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల పిండి గిర్ని యంత్రాలను జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు, జెడ్ పి టి సి నాగేశ్వరరావు లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో ఉంచడంలో భాగంగా మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సినిమా థియేటర్ విజయవంతంగా నడుస్తుందని, దీనిలో మహిళా సంఘాల కృషి ఎంతో ఉందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. మహిళలు తమ సంఘాల ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న బ్యాగులు మార్కెటింగ్ చేయడం ద్వారా అభివృద్ధి చెందాలని, మహిళా సంఘాలు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగాలని, ఉత్పత్తి అయిన బ్యాగులు ప్రతి షాపులకు అందించి మార్కెటింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళా ఆరోగ్యం పై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వడ్డీ లేని రుణాలు లో భాగంగా 3 కోట్ల 65 లక్షల రూపాయల చెక్కును జిల్లా సమైక్యకు అందించడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సినిమా హాలు, షాపులు, బ్యాగులు తయారు చేసే యంత్రం ప్రారంభించడం సంతోషంగా ఉందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఆసిఫాబాద్ శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కులు అందజేయడం చాలా సంతోషంగా ఉందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సినిమా హాలు ద్వారా చాలామందికి ఉపాధి కల్పించడం జరిగిందని మహిళా సంఘాలకు భవనాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం శ్రీనిధి అవార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, ఏ పి డి శ్రీనివాస్ రెడ్డి, ఎల్ డి ఎం హనుమంతరావు, జిల్లాలోని ఏ పి ఎం లు, సి సి లు, జిల్లా మహిళా సమైక్య, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కొమరం భీమ్ ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post