మొక్కలు సంరక్షించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణన్ని అందించవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం చింతగూడ గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ద్వారా మొక్కలను సంరక్షించి ప్రజలకు స్వచ్ఛమైన సహజవాయువు అందించడం జరుగుతుందని, వాతావరణ సమతుల్యత జరుగుతుందని అన్నారు. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు సకాలంలో నీటిని అందించి సంరక్షించాలని, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్ ను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా సేకరిస్తున్న తడి, పొడి చెత్త లను సక్రమంగా వినియోగించి సెగ్రిగేషన్ షెడ్లు కంపోస్ట్ తయారు చేసి మొక్కల ఎదుగుదలకు వినియోగించాలని తెలిపారు.
అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధిస్తూ వారి పఠన సామర్థ్యం పెరిగే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని తెలిపారు. చదువుతో పాటు సమాజం గురించి తెలుసుకునే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, క్రీడా, ఇతర ఇతర రంగాలలో రాణించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని, పట్టుదలతో సాధించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది.