ASF : వృద్ధుల సంక్షేమం అందరి బాధ్యత : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

వృద్ధుల సంక్షేమం, పోషణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో ఆసిఫాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు ఆత్రం సక్కుతో కలిసి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం గోడ ప్రజలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యచరణ ప్రణాళిక ప్రకారంగా జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వృద్ధులు తాము జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అనుభవంతో భావితరాలకు మార్గదర్శకులుగా సన్మార్గంలో నడిపిస్తారని అన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వృద్ధుల కొరకు ఆసరా పెన్షన్, కంటి వెలుగు, డే కేర్ సెంటర్స్, రాష్ట్రీయ వయోశ్రీ యోజన, ఫిజియోథెరపీ, మొబైల్ మెడికేర్ యూనిట్స్ ద్వారా సేవలు అందించడం జరుగుతుందని, అత్యవసర సేవల కొరకు వృద్ధుల హెల్ప్ లైన్ 14567 ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ వారోత్సవాలలో సంబంధిత సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, వయోవృద్ధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి సావిత్రి, జిల్లా విద్యాధికారి అశోక్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, ముఖ్య ప్రణాళిక అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post