జిల్లాలో 100% ఓటర్ల నమోదు దిశగా అధికారులు రాజకీయ పార్టీ నాయకులు కృషి చేయాలని ఎలక్ట్రోరల్ అబ్జర్వర్ బెన్హర్ మహేష్ దత్ ఎక్కా సూచించారు. ప్రత్యేక ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రానికి వచ్చిన అబ్జర్వర్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 100% ఓటర్ నమోదు దిశగా కృషి చేయాలని దీని కోసం వివిధ పార్టీల ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. ఓటర్ నమోదు కోసం ఈ నెల 8 చివరి తేదీ అని ఆలోపు పూర్తిస్థాయిలో నమోదు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. జిల్లాలో పి.వి.టి.జి. గ్రూపు ఓటర్లు నమోదు కోసం కుల పెద్దల సహకారం తీసుకోవాలన్నారు. రెండో విడతలో ఓటర్ల నమోదుకు సంబంధించి ఇంటికి వెళ్లి సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. ఓటర్ కార్డు ప్రామాణికం కాదని ఓటర్ లిస్టులో పేరు ఉందో లేదో చూసుకోవాలన్నారు. లేకుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెండు ఓట్లు కలిగి ఉన్న వారిని గుర్తించి తొలగించే ప్రక్రియ చేపట్టాలన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యప్తంగా వివిధ మాధ్యమాల ద్వారా ఓటర్ల నమోదు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. పివిటిజిల నమోదు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లాలో నూతనంగా 14000 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ట్రాన్స్ జెండర్లు దరఖాస్తులు తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసామన్నారు. వివిధ పార్టీల ప్రతినిధుల సహాయ సహకారాలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి డిఆర్ఓ రాజేశ్వర్ వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కొమరం భీమ్ ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.