Asifabad : అన్ని రంగాల అభివృద్ధిలో జిల్లాను ముందంజలో ఉంచాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజలకు సేవలను మరింత సులభతరం చేసే విధంగా అన్ని ప్రభుత్వ శాఖలతో జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించడం జరుగుతుందని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో ఉంచే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి జిల్లా పంచాయతీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వెల్కమ్ బోర్డు నుండి ప్రతి అంశంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, నూతన కలెక్టరేట్ వద్ద రోజ్ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని, జిల్లా అంతటా పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడా కూడా చెత్త వేయకుండా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని వాగు వద్ద నుండి రోడ్లకు ఇరువైపులా చెత్తను తొలగించాలని, హనుమాన్ విగ్రహం నుండి జిల్లా లోపలి వరకు, అంబేద్కర్ చౌక్, కొమరం భీమ్ చౌక్, అక్కడి నుండి బైపాస్ వరకు శుభ్రపరిచి మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. నూతనంగా ప్రారంభంకానున్న కలెక్టరేట్ భవన ఆవరణలో 3 అడుగుల నుండి 4 అడుగులు ఉండే మొక్కలు నాటాలని, జిల్లా అంతటా ప్లాంటేషన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆసిఫాబాద్ పట్టణమంతా పరిశుభ్రంగా, పచ్చదనంతో సుందరవనంగా కనిపించే విధంగా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. చిల్డ్రన్స్ పార్క్ లో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రపరచాలని, చెత్త బుట్టలను ఏర్పాటు చేసి వాటిని వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ పంచాయతీ అధికారి రవి కృష్ణ, డివిజనల్ పంచాయతీ అధికారి రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post