Asifabad : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు రావడం గర్వంగా ఉంది : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

పోషణ్ అభియాన్ కేటగిరిలో 2021 సంవత్సరానికి గాను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ప్రజా పరిపాలన విభాగానికి ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు రావడం గర్వంగా ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం సివిల్ సర్వీస్ డే ను పురస్కరించుకొని ప్రధాన మంత్రి ద్వారా ఎక్స్లెన్స్ అవార్డు అందుకోవడం జరిగిందని తెలిపారు. ఈ అవార్డు రావడంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వరుణ్ రెడ్డి సహకారం మరువలేనిదని, ఇందుకు ఐ. సి. డి. ఎస్., డి. ఆర్. డి. ఏ., ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తోడ్పాటు అందించారని తెలిపారు. ఈ అవార్డు రావడంలో అధికార యంత్రాంగం సమిష్టి కృషి ఉందని, ఇదే స్ఫూర్తితో జిల్లాను అన్ని రంగాలలో ముందు ఉంచేందుకు కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post