Asifabad : కొమురం భీం ఎడమ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలి :  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

జిల్లాలోని వట్టివాగు, అడ ప్రాజెక్టుల క్రింద చేపట్టిన కొమురం భీం ఎడమ కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ అన్నారు. మంగళవారం జిల్లాలోని కొమురం భీం ఎడమకాలువ పనులను నీటిపారుదల శాఖ అధికారులు, నవయుగ కాంట్రాక్టర్స్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటన సందర్భంలో పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తిచేయాలని సూచించడంతో నవయుగ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో పనులు మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. కొమురం భీం ఎడమ కాలువ 13.38 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయడం ద్వారా 45 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, ఆ దిశగా సంబంధిత అధికారులు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కాలువ ద్వారా సాగునీరు అందించడంతో రైతులకు పంట సాగుకు దోహదపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈ. ఈ. గుణవంత రావు, అధికారులు, నవయుగ కాంట్రాక్టర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post