Asifabad : జిల్లాలో పర్యాటక ప్రాంత అభివృద్ధికి చర్యలు : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అడ ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేయనున్న బోటింగ్ కోసం రాజస్వ మండల అధికారి దత్తు, తహసిల్దార్ పోచయ్యతో కలిసి సంబంధిత భూమిని పర్యాటక శాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అడ ప్రాజెక్టు పరిధిలో సందర్శకుల కోసం బోటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లాలో ఆహ్లాదాన్ని అందించే అనేక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే విధంగా అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. బోటింగ్ పనులు త్వరగా ప్రారంభించి, సందర్శన కోసం వచ్చే పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, గ్రామ పెద్ద ఆదె బాపురావ్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post