Asifabad : తెలంగాణకు హరితహారం నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన సహజ వాయువు అందించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేలా ప్రభుత్వం చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమ నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో హరితహారం కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యాన్ని సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకుని ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని తెలిపారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు నాటి సంరక్షించే విధంగా అధికారులు చొరవ చూపాలని, మొక్కలకు జియో ట్యాగింగ్ చేయాలని, నర్సరీలలో హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. మొక్కలకు సకాలంలో నీటిని అందించాలని, అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని వివిధ స్థాయిలలో పకడ్బందీగా అమలు చేయాలని, జిల్లాలో అటవీ శాతం పెరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ఆయా శాఖలకు కేటాయించడం జరిగిందని, మొక్కల సంరక్షణకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, భూములు, విద్యా సంస్థలలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. దళిత బంధు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేయడంతోపాటు అవగాహన సదస్సులు నిర్వహించి వివరించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి శాంతారాం, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post