Asifabad : దళిత బందు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి :  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

దళితుల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమం మొదటి విడతలో జిల్లాలో లబ్ది పొందిన వారు దళిత బంధు యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం రోజున పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని జైనూర్ మండలం జమ్గాన్ గ్రామంలో పల్లెనిద్ర చేసి శనివారం జిల్లాలోని జమ్గాన్, రాంజీగూడ, భీంజిగూడ, భూసిమెట్ట గ్రామాలలో  దళిత బంధు పథకం లో భాగంగా యూనిట్లను పొందిన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి యూనిట్ల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి దళిత లబ్ధిదారునికి దళిత బంధు పథకం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగా అర్హత కలవారు ఒకేరకమైన యూనిట్లను కాకుండా వివిధ రకాలైన ఈ యూనిట్లను ఎంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. అర్హులైన దళిత బంధు లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన పది లక్షల రూపాయలలో 9.90 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, మిగిలిన పది వేల రూపాయలను రక్షణ నిధి కింద జమ చేయడం జరుగుతుందని తెలిపారు. యూనిట్లను పొందిన లబ్ధిదారులు  యూనిట్లను సక్రమంగా నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదగాలని తెలిపారు.
 ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post