Asifabad : దళిత బంధు పథకం ద్వారా దళితుల అభివృద్ధి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

దళితుల అభ్యున్నతి, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని జన కపూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన దళిత బంధు అవగాహన సదస్సులో షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ అధికారి సజీవన్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగానే దళితుల అభ్యున్నతి, ఆర్థిక అభివృద్ధి కోసం దళిత బంద్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని, నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారుల చొప్పున అర్హులైన వారిని ఎంపిక చేయడం జరిగిందని, ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో 77 మందిని ఎంపిక చేసి వారి ఖాతాలలో నిధులు జమ చేయడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులు నిబంధనల మేరకు వారికి నచ్చిన యూనిట్లను ఎంపిక చేసుకుని సంబంధిత ప్రతిపాదనలు పంపించాలని, నిధులు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, దళిత బంధు పథకం లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post