Asifabad : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రస్తుతం వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ లో పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ తో పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు వాయుకాలుష్యం పెరిగిపోతుందని దీనివల్ల ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. వాయు కాలుష్యం తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గం కేవలం మొక్కల పెంపకం అని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పెరగడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకోవాలని దీనివల్ల కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. అంతకుముందు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని డంపింగ్ యార్డ్, సగ్రేగేశన్ షెడ్ పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. పల్లె ప్రగతి లో భాగంగా గ్రామాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ ప్రసాద్, సర్పంచ్ చునార్కార్ లక్ష్మి, పంచాయతీ సెక్రెటరీ, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి – కొమురం భీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post