Asifabad : పల్లెప్రగతి పనుల నిర్వహణలో అలసత్వం వద్దు : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమ నిర్వహణలో అధికారులు అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లాలోని సిర్పూర్ (టి) మండలం హుడికిలి గ్రామంలో జరుగుచున్న పల్లెప్రగతి పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లెప్రగతి పనుల నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం, నిర్లక్ష్యం వహించకుండా నిర్ధేశిత గడువులోగా పనులు వేగవంతం చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య పనుల ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామాలలోని రోడ్లపై, ఖాళీ ప్రదేశాలలో ఎక్కడా కూడా చెత్త వేయకుండా పర్యవేక్షించాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేసిన వారికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించే విధంగా చేపట్టిన క్రీడా ప్రాంగణాల పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో 2022-23 సంవత్సరానికి గాను నాటేందుకు అవసరమైన మొక్కలను నర్సరీలలో సిద్దం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post