Asifabad : పిల్లల ఆరోగ్యం, చదువు ప్రతి ఒక్కరి బాధ్యత  : మహిళ, శిశు, వయోవృద్ధుల శాఖ కమిషన్ సభ్యులు దేవయ్య అరికెల

పిల్లల ఆరోగ్యం, చదువు ప్రతి ఒక్కరి బాధ్యత అని మహిళ, శిశు, వయోవృద్ధుల శాఖ కమిషన్ సభ్యులు దేవయ్య అరికెల అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ, శిశు, వయోవృద్ధుల శాఖ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే వ్యాధిగ్రస్తుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి చికిత్స అందించాలని, మాత శిశు సంరక్షణలో భాగంగా జిల్లా పరిధిలో అంబులెన్సులు నడపబడుచున్నాయని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గిరిజన గ్రామాలలో ప్రజలకు త్రాగునీరు, పౌష్టికాహారం, ఆరోగ్య జాగ్రత్తలపై ఆరోగ్య, ఆశ, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో 44 ఆశ్రమ పాఠశాలలు, మూడు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయని, ఆశ్రమ పాఠశాలలలో చదువుతున్న బాల బాలికలకు పౌష్టికాహారంతో పాటు మెనూ ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ట్రై కార్ ద్వారా అర్హులకు రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలని, నిరుద్యోగులకు శిక్షణ అందించి స్థిరపడేలా చూడాలని, సంబంధిత అధికారులు ఆశ్రమ పాఠశాలలను సందర్శించినప్పుడు ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసే విధంగా చూడాలని తెలిపారు. జిల్లా వెనుకబడినతరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 11 వసతి గృహాలు నిర్వహించడం జరుగుతుందని, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏడు వసతి గృహాలు, మూడు పోస్టుమట్రిక్ వసతి గృహాలు, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు రెసిడెన్షియల్ కళాశాలలు, మూడు మదర్శలు నిర్వహించడం జరుగుతుందని, వీటిలో నిరంతర పర్యవేక్షణ జరగాలని తెలిపారు. జిల్లా పరిశ్రమ శాఖ పరిధిలో 15 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, వీటిలో బాల కార్మికులు పనిచేయకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. మైనర్ బాల బాలికలు వాహనాలు నడపకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపినట్లు అయితే బాల బాలికల తల్లిదండ్రులకు జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో బడి మానేసిన బాలలు, డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలలకు వచ్చే విధంగా సంక్షేమ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాఠశాలల ఉపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సురేష్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మణెమ్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post