Asifabad : భూ సంబంధిత సమస్యలను మండలాల పరిధిలోనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

జిల్లాలో భూ సంబంధిత సమస్యలను మండల పరిధిలోనే పరిష్కరించాలని, పరిష్కారం వీలులేని కఠిన సమస్యలను జిల్లాస్థాయికి పంపించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా రెవెన్యూ అధికారి సురేష్ తో కలిసి ధరణి, మీ-సేవ, కళ్యాణలక్ష్మి కార్యక్రమాలపై రాజస్వ మండల అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ కార్యాలయం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి కార్యక్రమం ద్వారా భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, పరిష్కారానికి సులువుగా ఉండే సమస్యలను ఈనెల 20వ తేదీలోగా మండల పరిధిలోనే పూర్తి చేయాలని, హెచ్. ఆర్. సి. ఫైల్లు, కోర్టు సంబంధిత కేసులు పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండలాల పరిధిలో సమస్యలు పెండింగ్ లో లేకుండా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మీ- సేవ ద్వారా అభ్యర్థులు చేరుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post