Asifabad : 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

గ్రామస్థాయి నుండి అభివృద్ధి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం 5వ విడత ఈనెల 18వ తేదీ వరకు జరుగుతుందని, దీని ద్వారా గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని వాంకిడి మండలం ధాబా గ్రామపంచాయతీ లో 5వ విడత పల్లె ప్రగతి లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం గురించి, చెత్త సేకరణ గురించి, తడి చెత్త పొడి చెత్త సేకరణ ట్రాక్టర్ వినియోగం, నీటి సరఫరా, మురుగు కాలువలు నిర్వహణ, విద్యుత్ సౌకర్యం, అంతర్గత రోడ్డు వసతి, పల్లె ప్రకృతి వన, పాఠశాల విద్య, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం లో గ్రామ సభలో ఆమోదించిన గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని, తద్వారా ప్రభుత్వం నుండి మరింత అభివృద్ధికి అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంలో పంచాయతీ కార్యదర్శి గ్రామానికి ప్రభుత్వం మంజూరైన నిధులు అలాగే పన్నుల ద్వారా వచ్చిన నిధులు వివరించి ఇట్టి నిధుల వినియోగంతో గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులపై జమా ఖర్చులను నివేదిక సమర్పించారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మధుకర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి, ఏ.ఈ(పి.ఆర్), ఏ.ఈ (ట్రా న్స్ కో) పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post