DPRO ADB – ఇంటింటి ఆరోగ్య సర్వేతో పాటు వ్యాక్సిన్ పంపిణీ ని పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

  ఇంటింటి ఆరోగ్య సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, సర్వే తో పాటు వ్యాక్సిన్ పంపిణీ వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున పట్టణంలోని క్రాంతి నగర్, ఆదిలాబాద్ గ్రామీణ మండలం లోని యాపల్ గూడా లో ఫీవర్ సర్వే, ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన ఫామ్ పాండ్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫీవర్ సర్వే, వాక్సిన్ పంపిణీ వివరాలు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల…

DPRO ADB- రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

రాజ్యాంగ స్ఫూర్తిని దశదిశలా వ్యాపింప చేస్తూ, రాజ్యాంగం ద్వారా సంక్రమించే ఫలాలను అర్హులైన వారికీ అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా బుధవారం రోజున కలెక్టరేట్ లో ఉదయం 10 గంటలకు జాతీయ పథకాన్ని ఆవిష్కారించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. కోవిడ్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గతతంత్ర వేడుకలను సాదాసీదాగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ విలువలను స్ఫూర్తిదాయకంగా…

DPRO ADB- ప్రజాస్వామ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సువిశాల భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటుహక్కు కీలకమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో నిర్వహించిన 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరుగా నమోదు అయిన వారందరు తమ వివరాలను ఓటర్ లిస్టులో సరిచుసుకోవాలని, 16, 17…

DPRO ADB-జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేలా, ఓటర్ నమోదుకు గర్వపడేలా, ఓటు వేసేందుకు సిద్ద పడేలా ప్రతి ఓటర్ సంసిద్ధులు కావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 12 జాతీయ ఓటర్ దినోత్సవాన్ని 25 జనవరి 2022 న జిల్లా, మండల బూత్ స్థాయి లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి నిర్వహించుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ గురించి, ఓటు హక్కు విలువ గురించి తెలుపుతూ ప్రతిజ్ఞ చేయించాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో 18 ఏళ్ళు నిండిన…

DPRO ADB – బాలికలు వివిధ రంగాల్లో శిక్షణ పొంది ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సముపార్జించుకోవాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆర్థిక స్వాతంత్య్రం, శిక్షణ నైపుణ్యాలను బాలికలకు అత్యవసరమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం కార్యక్రమాన్ని సోమవారం రోజున స్థానిక టిటీడీసీ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై బాలిక దినోత్సవం సందర్బంగా బాలికలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వివిధ రంగాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలకు చేయూతనిస్తున్న స్వచ్చంద సంస్థ ను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్బంగా కలెక్టర్…

DPRO ADB – ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ నైపుణ్య తరగతులను సద్వినియోగ పరచుకొని ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున ఎస్సీ స్టడీ సర్కిల్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను కలెక్టర్ అందజేశారు. తొలుత డా.బి.ఆర్. అంబెడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల నుండి కోవిడ్ వలన విద్యార్థులను కలువలేక పోయామని,…

DPRO ADB- కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నాగోబా జాతరను నిర్వహించుకోవాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఘనంగా, సాంప్రదాయ బద్దంగా, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈ నెల 31 న కేస్లాపూర్ నాగోబా మహా పూజతో జాతర ప్రారంభం కానున్న దృష్ట్యా, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ దర్బార్ హాల్ లో జాతర ఏర్పాట్లపై ITDA ప్రాజెక్టు అధికారితో కలిసి అధికారులతో సమీక్షించారు. ముందుగా నాగోబా దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా…

DPRO ADB- కృషియల్ సంక్షేమ నిధులు సకాలంలో వినియోగించండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

దళితుల కమ్యూనిటీ హాల్ ల నిర్మాణాలకు అవసరమైన భూములు కేటాయించాలని, కృషియల్ సంక్షేమ నిధులు సకాలంలో వినియోగించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో కృషియల్ సంక్షేమ నిధి పై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ పనులకు గాను సుమారు 29.98 లక్షల రూపాయలు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని, అట్టి పనులను వెంటనే పూర్తిచేసి ఫొటోగ్రఫీ లను సమర్పించాలని ఇంజనీరింగ్…

DPRO ADB- ఎస్సీ, ఎస్టీ కేసులు త్వరితగతిన పరిష్కరించండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

షెడ్యూల్డు కులాలు, తెగలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా నియమించిన కమిటీ సభ్యుల పరిచయాలను నిర్వహించారు . ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ సందర్బంగా సకాలంలో సమావేశాలు నిర్వహించలేక పోయామని, ఎస్సీ, ఎస్టీలకు సంబందించిన సమస్యలను ఏ సమయంలో నైనను…

DPRO ADB- గడువులోగా దళిత బంధు లబ్ధిదారుల ఎంపికను నిర్వహిస్తాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించి దళితుల ఆర్థిక స్థితిగతులను పెంపొందించడానికి రూపొందించడం జరిగిందని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రోజున BRK భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్ లో కరీంనగర్ నుండి మంత్రి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు కార్యక్రమం అమలుపై వివరించడం జరిగిందని, దేశంలో గాని, ఏ రాష్ట్రంలో గాని నిర్వహించని…