జిల్లాలో 2021-28 సంవత్సరానికి సంబంధించి మద్యం దుకాణాల నిర్వహణ కొరకు చేసుకున్న దరఖాస్తుల నుండి డ్రా పద్దతిన నిర్వాహకులను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆదివాసి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ కమీషనర్‌ శ్రీనివాస్‌ రెడ్ది, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రాజ్యలక్ష్మి లతో కలిసి లాటరీ విధానం ద్వారా నిర్వాహకులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రెండు సంవత్సరాల ఒప్పందం మీద మద్యం…

జిల్లాలోని పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బి. ఈ.డి. కళాశాలలో జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి మణెమ్మతో కలిసి సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఉన్నత పాఠశాలలు, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు,…

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పని చేయాలని, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమీషనర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో సూపర్‌వైజర్‌ సప్లమెంటరీ ఫీడింగ్‌ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మీ ఆసిఫాబాద్‌ నియోకజవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కుతో కలిసి అంగన్‌వాడీ సి.డి.పి.ఓ.లు, సూపర్‌వైజర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ధరణి కార్యక్రమం ద్వారా పారదర్శకమైన రిజిస్ట్రేషన్లు సాధ్యమవుతున్నాయని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. ధరణి పోర్టల్‌ ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశంతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ధరణి విజయంపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ధరణి పోర్టల్‌ ద్వారా 98 శాతం వ్యవసాయ భూముల సమస్యలు పరిష్కరించడం జరిగిందని, ఈ పోర్టల్‌లో…

జిల్లాలోని అర్హులైన ప్రతి దండారికి 10 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం జిల్లాలోని ఆదివాసీ భవన్‌లో 24వ కుంరం సూరు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన దండారి ఉత్సవాలను ఆసిఫాబాద్‌ నియోజకవర్గ శాసననభ్యులు ఆత్రం సక్కుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి దండారికి 10 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని, ఆదివాసీలు వారి పిల్లలు ఉన్నత విద్య అభ్యసించి అభివృద్ధి చెందేలా…

అర్హులైన వారికి రుణ సదుపాయం కల్పించడం ద్వారా వారికి ఆర్థిక చేయూత నిచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వొడ్డెపల్లి గార్దెన్స్‌ ఫంక్షన్‌హాల్‌లో రుణ మేళాపై ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన రుణ మేళా నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా బ్యాంకులు సంయుక్తంగా మేళాను…

జిల్లాలో 18 సం॥లు నిండిన (ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాజేశం, జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ 18 సం॥[లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తమ వివరాలు…

ప్రభుత్వం అర్జ్హుత కలిగిన ప్రతి పోడు రైతుకు పట్టా పంపిణీ చేసేందుకు గాను నవంబర్‌ 8వ తేదీ నుండి డిసెంబర్‌ 8వ తేదీ వరకు పోడు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు క్లెయిమ్స్‌ తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాజేశం, జిల్లా అటవీ అధికారి శాంతారామ్‌, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…

జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కారంపై సమన్వయంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అటవీ, రవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కరించే దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని, గిరిజనులు కొద్ది మొత్తంలో మాత్రమే సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని, వారిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.…

ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని జోడెఘాట్‌లో ఏర్పాటు చేసిన కొమురంభీం 81వ వర్థంతి కార్యక్రమంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు సోయం బాబురావు, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్‌ ప్రాజెక్టు అధికారి భవేశ్‌ మిశ్రా, శాసన మండలి సభ్యులు పురాణం సతీష్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కు, డి.సి.పి.…