జనగామ, సెప్టెంబర్ 1: తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో పాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటానని జనగామ జిల్లా నూతన కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. జనగామ కలెక్టర్ గా బుధవారం కలెక్టరేట్ లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారిస్తూనే ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో…

*వారం రోజులు జిల్లాకు భారీ వర్ష సూచన* *అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ కె. నిఖిల* జనగామ, ఆగస్టు 30: రాబోయే వారం రోజులు జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. నిఖిల అన్నారు. సోమవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, తహశీల్దార్లకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో 12 జిల్లాల్లో వారం రోజులు భారీ…

జనగామ, ఆగస్టు 30: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. సోమవారం డిజిపి ఎం. మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, నీటిపారుదల శాఖ అధికారులతో భారీ వర్షాలకు చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, గ్రామాల్లోని చెరువు కట్టలను, అలుగు, తూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పశువులు, మనుషులు అటువైపు వెళ్లకుండా పోలీసులు…

జనగామ, ఆగస్టు 30: సెప్టెంబర్ 27 న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ విభాగాల నుండి అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక అధికారి ఎం. శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ పర్యాటక రచన, ప్రచురణ విభాగంలో రెండు అవార్డులు, పర్యాటక రంగ ఫిలిం కేటగిరిలో ఒకటి, ట్రావెల్ ఏజెంట్/టూర్ ఆపరేటర్ విభాగంలో రెండు, స్టార్ కేటగిరి హోటల్స్ విభాగంలో రెండు, రోడ్ సైడ్ హోటల్స్…

జనగామ, ఆగస్టు 28: జిల్లాలోని పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్ లో 1వ స్థాయి నుండి 7వ స్థాయి సంఘ సమావేశాలను చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఇట్టి సమావేశంలో విద్య, విద్యుత్, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, పౌరసరఫరాలు, భూగర్భజల శాఖ, పరిశ్రమలు, ఉపాధికల్పన, గ్రామీణ త్రాగునీరు, పంచాయితీరాజ్, సహకారం, వైద్యం, క్రీడలు, చేనేత జౌళీ,…

జనగామ ఆగస్ట్ 26 : ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకొని ఆర్ధిక పరిపుష్టి పొందాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్ అన్నారు. గురువారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమ మండలి వరంగల్ రీజియన్, జిల్లా పరిశ్రమలశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఉపాధికల్పన పథకంపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఉపాధికల్పన పధకం ఉపాదితోపాటు…

జనగామ, ఆగస్టు 26: జిల్లాలో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనా తరగతుల ప్రారంభానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. నిఖిల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యా శాఖ, సంక్షేమ గురుకుల విద్యా సంస్థల అధికారులు, ఎంపిడివోలు, ప్రయివేటు విద్యా సంస్థల బాధ్యులతో జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష బోధనా తరగతులు ప్రారంభించడానికి చేపట్టాల్సిన చర్యలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుమారు 16 మాసముల తర్వాత విద్యా…

జనగామ, ఆగస్టు 25: ఈ నెల 28 కల్లా తెలంగాణ కు హరితహారం క్రింద శాఖల వారీగా నిర్దేశిత లక్ష్యాన్ని ఆన్లైన్ నమోదుతో సహా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. నిఖిల అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, ఎంపిడివోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో హరితహారం, సెగ్రిగేషన్ షెడ్లు, బృహత్ ప్రకృతి వనాలు, మినీ పల్లె ప్రకృతి వనాలు, పాఠశాలల పునఃప్రారంభంపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.…

జనగామ, ఆగస్టు 24: విద్యా సంస్థల పునఃప్రారంభానికి ఆగస్టు 30 లోగా అన్ని చర్యలు పూర్తి చేసి సన్నద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల పై రాష్ట్ర పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంగళవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థల…

జనగామ, ఆగస్టు 21: స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జనగామలో శనివారం ఫ్రీడమ్ రన్ ను చేపట్టినట్లు నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర సంచాలకులు అన్షుమన్ ప్రసాద్ దాస్ అన్నారు. ఫ్రీడమ్ రన్ ని రాష్ట్ర సంచాలకులు బతుకమ్మకుంట వద్ద జెండా ఊపి ప్రారంభించారు. బతుకమ్మకుంట నుండి నెహ్రూ పార్క్ వరకు సాగిన ఫ్రీడమ్ రన్ లో యువత ఉత్సాహంగా…