73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో, కలెక్టరేట్లో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా అధికారులు ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు జోహార్లు…

 కరోనా నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో శనివారం కరోనా నియంత్రణ, దళిత బంధు అమలు పై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా నియంత్రణకు మొదటి విడత డోసులు 92 శాతం , రెండో విడత డోసులు 69 శాతం వేసినట్లు మంత్రి చెప్పారు. జిల్లాలో 2.10 లక్షల…

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఈనెల 25లోగా పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల సంఖ్యను గుర్తించి జిల్లా స్థాయి అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గం కు 100 యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. గ్రామ పంచాయతీల వారీగా జ్వరం సర్వే పూర్తిచేయాలని సూచించారు. లక్షణాలు ఉన్న వారి వివరాలు జిల్లా స్థాయి అధికారులకు తెలియజేయాలని…

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు బాల, బాలికలను సమానంగా చూడాలని సూచించారు. బాలికలు తమకు నచ్చిన లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా చదువుకొని సమాజంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల…

సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. సర్వే బృందం ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలో ఎవరికైనా దగ్గు, జ్వరం తో బాధపడుతున్న వారు ఉన్నారా అని అడిగి తెలుసుకోవాలని చెప్పారు. స్వల్ప లక్షణాలున్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్లను అందజేయాలని కోరారు. ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారిని వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలని కోరారు. జిల్లాలో కరోనా అదుపులో ఉందని పేర్కొన్నారు. కరోనా…

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సివిల్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లుల వారిగా మిల్లింగ్ చేసిన వివరాలపై సమీక్ష చేపట్టారు. రైస్ మిల్లుల వారీగా మిల్లింగ్ ముమ్మరంగా చేపట్టాలని కోరారు. సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్, ఇంచార్జ్ జిల్లా సివిల్ సప్లై అధికారి రాజశేఖర్, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. —————— జిల్లా పౌర సంబంధాల అధికారి…

గదిలో ఉన్న క్రీడా పరికరాలను చూశారు. క్రీడా మైదానాన్ని సందర్శించారు. క్రీడామైదానంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్ క్రీడాకారులు అడుతారని జిల్లా క్రీడలు, యువజన సర్వీసులు అధికారి వై. దామోదర్ రెడ్డి కలెక్టర్ కు తెలిపారు. కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు. —————– జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

సమీకృత జిల్లా కార్యాలయంల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం పోలీస్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్, రోడ్డు రవాణా శాఖ అధికారులతో రోడ్డు భద్రత నియమాలపై సమీక్ష నిర్వహించారు. హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలలో అధిక మంది వ్యక్తులు మృత్యువాత పడుతున్నారని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుంటే తప్పనిసరిగా జరిమానాలు విధిస్తారని పేర్కొన్నారు. అతి వేగంగా వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. జిల్లాలో పది చోట్ల ప్రమాదాలు…

బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ, తదితర విషయాలపై సూచనలు చేస్తూ, ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు ఓటర్ కిట్ కూడా జాతీయ ఓటర్ దినోత్సవం వచ్చే జనవరి 25 లోగా నూతనంగా నమోదైన ఓటర్లకు అందచేయాలని తెలిపారు. ఓటర్ కిట్ లో వ్యక్తిగత లేఖ, ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ, ఎపిక్ కార్డు కలిగి ఉంటుందని…

కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం ఐ సి డి ఎస్, వైద్యశాఖ, ఐకెపి అధికారులతో బలహీనమైన పిల్లలను గుర్తించాలని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లల బరువును, ఎత్తులు కొలువాలని సూచించారు. అంగన్వాడి, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి బరువు తక్కువ ఉన్న పిల్లలకు అదనంగా పౌష్టికాహారం అదేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల వారిగా బలహీనమైన పిల్లలను గుర్తించాలని పేర్కొన్నారు. గ్రామ సమాఖ్యలలో మహిళా ఆరోగ్య సమితి…