గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి డిఆర్డిఓ, డిపిఓ, జడ్పీ సిఈఓ, డివిజనల్ పంచాయతీ అధికారులు, యంపిడిఓలు, యంపిఓలు, ఏపిఓలతో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణ, కార్యదర్శుల హాజరు, సిసి చార్జీలు, రుణాలు చెల్లింపు, కోవిడ్ వాక్సినేషన్, వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు నిర్వహణ, ఇంటి పన్నులు వసూళ్లు, ఉపాధిహామి పథకం, ఇంకుడు గుంతలు, హరితహారం, బృహత్ పల్లె పకృతి వనాలు, మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ జియో ట్యాగింగ్ తదితర పల్లె ప్రగతి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మార్చి…

. బుధవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నిరాడంబరంగా వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఎన్నో అడుగులు వేసినట్లు చెప్పారు. మనందరం ఒక టీముగా కష్టాలను అధిగమించి కృషి చేస్తే ప్రగతి సాధ్యమేనని…

బుధవారం రామవరంలో నిర్మించిన 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ కేంద్రం ఏర్పాటు వల్ల గర్భిణిలకు, చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న పరికరాలు, బెడ్లును పరిశీలించి వైద్యాధికారులకు సలహాలు, సూచనలు జారీ…

. మంగళవారం 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశపు హాలులో ఓటుహక్కు ప్రాధాన్యత, ఎన్నికలు నిర్వహణ, నూతన ఓటర్లుకు ఓటుహక్కు వినియోగంపై అవగాహన, యువ ఓటర్లుకు ఎన్నికల గుర్తింపు కార్డులు పంపిణీ, వయోవృద్ధులైన ఓటర్లుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుహక్కు చాలా విలువైనదని, అందువల్ల ఎన్నుకొనే ప్రతినిధిని వివేకంతో ఎన్నుకోవడానికి ప్రతి ఎన్నికలో పాల్గొనాలని ఆయన ఓటర్లుకు సూచించారు. మన ఎన్నికల వ్యవస్థ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని,…

. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో డయల్: యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి ఫోన్ ద్వారా ప్రజలు తెలియచేసిన సమస్యలను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కొద్ది మంది అధికారులు మాత్రమే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి హాజరయ్యారని, వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించుటకు సిఫారసు చేస్తున్నట్లు ఆయన వివరించారు. గత సంవత్సరం జూన్ మాసం నుండి ఈ రోజు నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం వరకు సమస్య పరిష్కారానికి…

. సోమవారం కలెక్టరేట్ సమావేశు హాలులో బాల సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ నివేదికలు, యం అంగన్వాడీ యాస్లో సిడిపిఓలు, సూపర్జర్లు ఆన్లైన్ హాజరు శాతం, పౌష్టికాహారం, భద్రాచలం శిశు గృహం చిన్నారుల దత్తత కార్యక్రమాలు, కోవిల్ వ్యాప్తి, వ్యాక్సినేషన్, తహసీల్దార్, యంపడికి, కార్యాలయాల్లో బయో మెట్రిక్ హాజరు అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరులో ఏర్పాటు చేయనున్న బాలల సంరక్షణ కేంద్రంలో చిన్నారులు ఆటలు ఆడుకోవడానికి…

సోమవారం పాల్వంచ మండలం గుడిపాడు. అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో ఏర్పాటు చేసిన న్యూట్రి కిచెన్ గార్డెనన్ను పరిశీలించారు. న్యూట్రీ గార్డెన్లో అంగన్వాడీ టీచర్, ఆయా కూర మంచిగా కూరగాయలు పండిస్తున్నారని, కిచెన్ గార్డెన్ చాలా బాగా చేశారని సిబ్బందిని అభినందించారు. కిచెన్ గార్డెన్లో పండిన తాజా కూరగాయలు వినియోగం వల్ల చిన్నారులు పోషణ లోపాన్ని అధిగమిస్తారని, చెప్పారు. ఇదే స్ఫూర్తితో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ…

శనివారం అశ్వాపురం మండలం, అమ్మగారిపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలనకు హైదరాబాదు నుండి హెలికాఫ్టర్ లో ఇంజినీర్ ఇన్ ఛీఫ్ మురళీధర్రెడ్డి, ఎల్ అండ్ టి సిఈఓ సుబ్రమణ్యంలతో కలిసి మద్యాహ్నం 1.30 గంటలకు విచ్చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇరిగేషన్, ఎల్ అండ్ టి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు వరకు…

శనివారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, డిఈ, ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పారిశుద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి అన్ని మున్సిపాల్టీలో ప్రతి ఇంటి నుండి నూరు శాతం చెత్తసేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెత్త సేకరణ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యమైన అంశమని చెప్పారు. చెత్త సేకరణ ప్రక్రియ ఏవిధంగా జరుగుతున్నదని మున్సిపల్ కమిషనర్లును…

గురువారం హైదరాబాద్ నుండి  కోవిడ్ నియంత్రణకు ఇంటింటి సర్వే నిర్వహణ, వాక్సినేషన్ ప్రక్రియ, ఐసో లేషన్ కేంద్రాలు  ఏర్పాటు తదితర అంశాలపై రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, టీఎస్ ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,  సీఎస్ సోమేశ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని చెప్పారు.అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ ఓ.పి. సేవలు అందించాలని…