తల్లి దండ్రుల పై శ్రద్ధ చూపినట్లు గానే వయో వృద్ధుల పై శ్రద్ధ చూపించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.వయో వృద్ధుల పట్ల అవమానకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వయో వృద్ధులకు సంబంధించి ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ప్రతి 15…

ఈ నెల 1 నుండి 31 వరకు నిర్వహించనున్న “క్లీన్ ఇండియా” కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీ లలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువక కేంద్రం ద్వారా నెల రోజుల పాటు నిర్వహించనున్న “క్లీన్ ఇండియా” కార్యక్రమం పై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు . “క్లీన్ ఇండియా” కార్యక్రమంలో అందరిని భాగస్వాములను…

మహబూబ్ నగర్ జిల్లా ను ఎక్స్పోర్ట్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవాలలో భాగంగా గురువారం రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయ, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన ఉత్పత్తులు ఇదివరకే విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, అయితే వాటికి సంబంధించి ఉత్పత్తుల నాణ్యత…

మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో హరిత హారం,పట్టణ ప్రగతి కింద చేపట్టిన పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేదించారు. బుధవారం ఆయన రెవెన్యూ సమావేశమందిరంలో మహబూబ్ నగర్,జడ్చర్ల,భూత్పూర్ మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. జడ్చర్ల-మహబూబ్ నగర్,భూత్పూర్-మహబూబ్ నగర్ రహదారులకిరువైపుల బహుళ వరుసలలో మొక్కలు నాటడం ,రోడ్డు మధ్యలో సెంట్రల్ మీడియన్ లో నాటుతున్న మొక్కల పని త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే బై పాస్ రహదారికిరు పక్కల కూడా మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు. మహబూబ్…

@దేశంలోనే అతి పెద్దదైన కెసిఆర్ అర్బన్ ఎకో పార్కు మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంది @మహబూబ్ నగర్ జిల్లా ఏకో టూరి జానికి, టెంపుల్ టూరిజానికి ఎంతో ప్రసిద్ధి @ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్ నగర్ సమీపంలోని కెసిఆర్ అర్బన్ ఎకో పార్కు లో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు జ్యోతి…

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఇకపై ప్రతి నెల చివరి బుధవారం ఈ కార్యక్రమం ఉంటుందని, ఈ ప్రజావాణి కార్యక్రమంలో ప్రత్యేకంగా దివ్యాంగుల సమస్యలను మాత్రమే పరిష్కరిస్తామని, ఒకవేళ తమ పరిధిలో లేని వాటిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు . జిల్లాలో ఖాళీగా ఉన్న 25 వికలాంగుల పోస్టులను భర్తీ చేశామని, ఇకపై కూడా ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ…

మంగళవారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విషయం పై నిర్వహించిన సెమినార్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎస్ సి విద్యార్థుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నదని, ఈ పథకం కింద విదేశాలలో లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలలో పిజీ, మరియు ఆపై ఉన్నత స్థాయి విద్య అభ్యసించేందుకు ఎంపికైన…

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఎంతో అభివృద్ధి సాధించామని, వీటన్నింటిని గ్రామాలలో ప్రజలకు సాహిత్యం ద్వారా తెలియ జేయాలని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు . సోమవారం మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో పి ఆర్ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పిఆర్టియు స్వర్ణోత్సవ సంబరాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయుల గురించి ఆలోచించే అతిపెద్ద సంస్థ…

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల వద్దనుండి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం 73 మంది పిర్యాదుదారులు వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు,జిల్లా అధికారులకు సమర్పించారు. ఈ సందర్బంగా కలేక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని,అప్పుడే అవి వెంటనే పరిష్కారం అవుతాయని అన్నారు. ఆయా శాఖల అధికారులు ఫిర్యాదుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే లబ్ధిదారులకు మేలు కలుగుతుందన్నారు కాగా సోమవారం వచ్చిన ఫిర్యాదులలో భూములకు సంబంధించిన…

భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీలు ఆర్థికంగా బలపడేందుకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర రావు పూలే తర్వాత అభినవ పూలే అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో లో వైన్ షాపుల కేటాయింపు లో ఎస్సీ, ఎస్టీల తోపాటు, గౌడ లకు రిజర్వేషన్ కల్పించినందుకు గాను ఆదివారం మహబూబ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు…