జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి ౩1వ తేదీ లోగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో తేని చేసి నిర్ధిశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణతో కలిసి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సహాయ…

ప్రజాస్వామ్యంలో సమర్థవంతమైన నాయకత్వం ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధి, సంక్షేమంపై విశిష్ట ప్రభావం చూపే ఓటు హక్కు ప్రజలకు చాలా విలువైనదని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ తెలిపారు. మంగళవారం జిల్లా 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ప్రతి సంవత్సరం…

బాలల సంరక్షణ, సంక్షేమం కోసం ఆపరేషన్‌ స్మైల్‌ సంబంధిత శాఖల సమన్వయంతో అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, జిల్లా సంక్షేమ అధికారిణి ఉమాదేవి, బాలల సంక్షేమ కమిటీ చైర్మన్‌ వాహిద్‌తో కలిసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల సంక్షేమం, ఆపరేషన్‌ స్మైల్‌ అమలు తదితర అంశాలపై సంబంధీత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా…

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం-2022 లో భాగంగా తేది : 01-01-2022 నాటికి 18 సం॥ల వయస్సు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్‌ గుర్తింపు కార్డులు (ఎపిక్‌ కార్జు) బూత్‌ స్థాయి అధికారుల ద్వారా అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాల మార్పులు, చేర్పులు ఇతరత్రా అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష…

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు క్షేత స్థాయిలో దృష్టి సారించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పి.సి.సి.ఎఫ్‌. ఆర్‌.శోభ, శాసన మండలి సభ్యులు దండె విఠల్‌, శాసనసభ్యులు, దయాకర్‌రావు, రేఖాశ్యాంనాయక్‌, రాథోడ్‌…

వివిధ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రికి రాలేని రోగులకు వారి వద్దకే వెళ్ళి వైద్య సేవలు అందించేందుకు ఆలన హోంకేర్‌ సర్వీస్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి తెలిపారు. బుధవారం జిల్లాలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్యాధికారి డా॥ కుమం బాలుతో కలిసి అంబులెన్స్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలలో వైద్య సేవలు అవసరం ఉండి ఆసుపత్రికి రాలేని వారి వద్దకే…

అంధత్వం కలిగిన దివ్యాంగులకు దిక్సూచిలా నిలిచి వారి జీవితాలలో విద్య వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి లూయిస్‌ బ్రెయిలీ అని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్‌రోడ్డులో గల సన్‌ పైన్‌ వయోవృద్ధుల దే కేర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన లూయిస్‌ (బెయిలీ 218వ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ చాలా మంది చిన్న చిన్న సమస్యలకే నిరాశ నిస్సృహలకు లోనవుతారని, దృష్టి లోపం ఉన్న…

కొవిడ్‌ వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా 15 నుండి 18 సం॥ల వయస్సు గల పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజల సహకారంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళుతుందని, ఈ మేరకు…

జిల్లాలో ప్రజలందరికీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అందే విధంగా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, ఆదిలాబాద్‌ శాసనసభ్యులు పురాణం సతీష్‌, మంచిర్యాల, బెల్లంపల్లి శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ…

దేశ అభివృద్ధి, భవిష్యత్తును మార్చడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో సంచలనాత్మక మార్పులు తీసుకువచ్చే శక్తి ఓటు హక్కుకు ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు. గురువారం జిల్లాలోని నస్సూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సమీయంలో ఈ.వి.ఎం., వి.వి.పాట్‌ గోదాములను జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఓటు హక్కు…