కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ-జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి, ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు ఎపిక్ కార్డులు బూత్ లెవల్ అధికారుల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్ లను కోరారు. బుధవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన…

పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయలి –  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

టి.ఎస్. ఐ పాస్ విధి విధానాలు, మార్గదర్శకాలకనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పుటకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయవలసినదిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో ఏర్పాటుచేసిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ టి.ఎస్. ఐపాస్ క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన ధరఖాస్తులలో 9 దరఖాస్తులు వివిధ స్థాయిలలో పెండింగులో ఉన్నాయని అన్నారు. పరిశ్రమల నెలకొల్పనకు ఒక మాసంలోగా అనుమతులు…

వడియారం అర్బన్ పార్కును పరిశీలించిన – అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ. శాంతకుమారి

చేగుంట మండలం వడియారం అర్బన్ పార్కులో నాటిన వివిధ మొక్కలను అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ. శాంతకుమారి బుధవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్.ఏం.డి.ఏ. ఆధ్వర్యంలో వడియారం, పోలంపల్లి, చందంపేట ఫారెస్ట్ బ్లాక్ లోని 528 . 82 హెక్టార్లలో 2019 లో చేపట్టిన ఈ అర్బన్ పార్కులో ఇప్పటి వరకు 2,32,300 మర్రి, వేప, జువ్వి, నెమలినార, కానుగ, టేకు, వెదురు, మారేడు, అల్లనేరేడు, రోజ్ వుడ్, తాని వంటి మొక్కలు…

రైతులు ఆరుతడి పంటలు వైపు మొగ్గు చూపాలి  – శాసనమండలి సభ్యులు  శేరి సుభాష్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని ఖరాఖండిగా చెప్పినందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసే విధంగా ప్రోత్సహించవలసినదిగా శాసనమండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి సూచించారు. మంగళవారం అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సాగునీటి సలహా సంఘం సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు, సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ యాసంగి పంటను ఎఫ్.సి.ఐ. కొనుగోలు చేయదు కాబట్టి ప్రత్యామ్నాయ…

ఏదైనా పెద్ద విపత్తు సంభవించినప్పుడు నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి-అదనపు కలెక్టర్ రమేష్

ఏదైనా పెద్ద విపత్తు సంభవించినప్పుడు అన్ని శాఖల అధికారులు అప్రమత్తమై సమన్వయంతో ఎదుర్కోవడానికి విపత్తు నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో విపత్తు నిర్వహణ లో భాగంగా తమ శాఖల ద్వారా విపత్తు ను ఎదుర్కోవడానికి ఉన్న వనరులు, తీసుకుంటున్న చర్యలపై లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అధిక ప్రాణ నష్టం,…

క్రిష్టమస్ గిఫ్ట్ ప్యాక్ పంపిణి – శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి

ప్రతి బీదవాడు పండుగను సంతోషగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రిష్టమస్ గిఫ్ట్ ప్యాక్ లు అందజేస్తున్నదని, కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్టమస్ పండుగను కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని మెదక్ శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక వైస్రాయ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన క్రిష్టమస్ గిఫ్ట్ ప్యాక్ పంపిణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ…

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగించాలని – జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

యాసంగి లో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ వ్యవసాయాధికారులకు, ఆర్.డి.ఓ.లు , తహసీల్ధార్లకు సూచించారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించుకొని ప్రతి రోజు 3 , 4 గ్రామాల చొప్పున శుక్రవారం వరకు అన్ని గ్రామాలను కవర్ చేస్తూ రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని, పంట మార్పిడి వలనే మేలు జరుగుతుందన్న విషయాన్ని స్పష్టంగా వివరించాలని అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్లు, ఆర్.డి.ఓ.లు,…

పురోగతిలో ఉన్న పనులు వేగవంతం చేయాలి  – జిల్లా కలెక్టర్ హరీష్

ప్రగతిలో ఉన్న రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం, రైతు వేదికలు, వైకుంఠధామాలు, ఏడుపాయలలో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో పంచాయత్ రాజ్ శాఖా ద్వారా చేపట్టిన వివిధ పనుల పురోగతిపై సమీక్షిస్తూ తూప్రాన్ మండలంలో గడ క్రింద చేపట్టి చివరి దశలలో ఉన్న మల్కాపూర్ గ్రామ పంచాయతీ, జిల్లా పరిషద్ పాఠశాల, యువజన సంఘ…

ఓటరు నమోదు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎలాక్టోరల్  పరిశీలకులు శైలజా రామయ్యర్

జిల్లాలో ఓటరు నమోదుకై స్వీప్ చేపట్టిన కార్య్రక్రమాలు చాలా బాగున్నాయని ఎలక్టరోల్ పరిశీలకులు శైలజ రామయ్యర్ కితాబిచ్చారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్, అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి 5 జనవరి 2022 న ప్రకటించు ఓటర్ల తుది జాబితా సందర్భంగా ఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపులు పై తహసీల్ధార్లు, బి.ఎల్.ఓ.తో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎక్కువ…

అక్రమ కట్టడాల నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్లు నివేదిక ఇవ్వండి – జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

జిల్లాలోని మెదక్, నరసాపూర్, తూప్రాన్, రామాయంపేట మునిసిపాలిటీల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలతో పాటు, పునర్నిర్మాణం గావిస్తున్న భవన నిర్మాణ వివరాలు, లే అవుట్ ల వివరాల నివేదికలను ఈ నెల 20 లోగా రీజనల్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కు పంపవలసినదిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో మునిసిపల్ కమీషనర్ల కు సూచించారు. రాష్ట్రంలో 173 గ్రామా పంచాయతీలను ఇటీవల అప్ గ్రేడ్ చేసి 74 మునిసిపాలిటీలు…