జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి మేడ్చల్​–మల్కాజిగిరి జిల్లా 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి బుధవారం సమీకృత కలెక్టరేట్ సముదాయంలో జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. కోవిడ్ నిబంధనల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలను నిడారంబరంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్​ (లోకల్​  బాడీస్​) శ్యాంసన్​, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​, ,జిల్లా కలెక్టరేట్​…

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును పండగగా నిర్వహించాలి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును కలిగి ఉండాలి జిల్లా వ్యాప్తంగా 7,558 మంది కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డుల అందచేత జాతీయ ఓటరు దినోత్సవంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును పండగగా నిర్వహించాలని ఈ విషయంలో ముఖ్యంగా యువతీ యువకులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి…

బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు వెళ్తున్నారని ఈ విషయంలో వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ ,1098 వారి…

రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో వంద మంది అర్హులకు దళితబంధు అమలు ఫిబ్రవరి 5వ తదీలోగా ఎంపిక పూర్తి – మార్చి 7వ తేదీలోగా యూనిట్​ గ్రౌండ్ల పూర్తి వీడియో కాన్ఫరెన్స్​లో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్​ కుమార్​ , రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్. మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వివరాలను తెలిపిన కలెక్టర్ హరీశ్​ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు…

మైనారిటీ వర్గాలకై స్మశాన వాటికలకై స్థలాల పరిశీలించిన కలెక్టర్​ హరీశ్​ రాష్ట్ర మంత్రి కేటీఆర్​ ఆదేశాలతో స్థలాల పరిశీలన రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందచేత రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకు మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లాతో పాటు హైదరాబాద్​ నగర పరిసరాల ప్రాంతాల్లోని మైనారిటీలకు సంబంధించి స్మశాన వాటికల ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించామని… ఈ విషయమై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందచేస్తామని జిల్లా…

నూతనంగా ఓటర్లుగా నమోదైన వారికి ఓటరు కార్డులు అందించాలి వీడియో కాన్ఫరెన్స్​లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్​ గోయల్​ జిల్లా వ్యాప్తంగా ఓటరు కార్డులు అందించేందుకు చర్యలు : కలెక్టర్ హరీశ్​ ప్రభుత్వం నూతనంగా ఓటర్లుగా నమోదు చేసుకొన్న వారికి సంబంధించి ఓటరు తుది జాబితాలను ఓటర్లకు (ఎపిక్​) ఓటరు కార్డులను అందచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్​ గోయల్​ అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. నూతనంగా ఓటరు…

జిల్లా వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు అవసరమైన చర్యలు అన్యాక్రాంతం, కబ్జాకు గురైన చెరువులను పరిశీలించి నోటీసులు జారీ చేయాలి మేడ్చల్ –  మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ మేడ్చల్ –  మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు.  బుధవారం జిల్లాలోని చెరువుల పరిరక్షణపై అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్,…

అడవులను కాపాడి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది కీసర హరిత వనము సందర్శించిన అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి హరితహారం మొక్కల పెంపకం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ అడవులను కాపాడి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఈ విషయంలో అందరూ సమన్వయంతో కృషి చేయాలని అటవీ శాఖ చీఫ్​ సెక్రెటరీ శాంతికుమారి అన్నారు. బుధవారం మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసరలోని హరిత వనముని జిల్లా…

స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2022 లో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని పరిశీలించాలని   రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం  అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ నమోదు కార్యక్రమం పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు  నమోదు చేసుకునే విధంగా స్వీప్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఎలక్ట్రోల్ లిటరసీ క్లబ్బులను సమర్థవంతంగా  నిర్వహించాలని, తద్వారా యువ ఒటర్లు, ఫ్యూచర్ ఓటర్లలో అవగాహన…

రాష్ట్రపతి రాక నేపథ్యంలో అన్ని శాఖల వారు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రపతి శీతాకాల విడిది ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్​ హరీశ్​ సమీక్ష భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శీతాకాల విడిది నేపథ్యంలో హైదరాబాద్​ రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీశ్​ అన్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శీతాకాల విడిది కోసం హైదరాబాద్​లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి…