కరోనా థర్డ్ వేవ్  ప్రబలుతున్న నేపథ్యంలో  కరోనా, ఒమిక్రాన్ వైరస్ ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి ఆదేశించారు .   గురువారం బోధన్ మండలం సాలూరు చెక్ పోస్టు వద్ద గల కరోనా పరీక్ష కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి వచ్చే ప్రతీ ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని సాలూర…

  గురువారం ఎడపల్లి మండలం జాన్కంపెట్, ఎడపల్లి గ్రామాలలో రహదారికి ఇరువైపులా పెంచుతున్న అవెన్యూ ప్లాంటేషన్ ను జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జిల్లాలో ఎడపల్లి మండలం జాన్కంపెట్, ఎడపల్లి గ్రామాలలో రోడ్లకు ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్ లో బాగంగా చెట్లను పెంచే బాధ్యత పూర్తిగా అటవీశాఖ అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టిన హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రతీ…

నందిపేట్ (నిజామాబాద్), జనవరి 11:– రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పలు కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండుగలా సాగుతోందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాలలో భాగంగా మంగళవారం నందిపేట మండలం నూత్ పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్ల క్రితం చూసుకుంటే వ్యవసాయం సాగు లో పలు సమస్యలు ఎదుర్కొన్నామని ముఖ్యంగా విద్యుత్తు సమస్య సమయానికి ఎరువులు విత్తనాలు అందకపోవడం పెట్టుబడికి…

  కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్థానిక ఈవీఎం గోదాంలో పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎం గోదాంలను భవనాల కండిషన్ పై పరిశీలించి నివేదిక అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం నాడు ఆయన సంబంధిత అధికారులతో గోదాంను నిర్వహిస్తున్న మరమ్మతులను పరిశీలించారు. స్లాబ్ లీకేజీ లేకుండా చూడాలని పనులు నాణ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఇపిఆర్ శంకర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం…

  రైతుకు పెట్టుబడి సబ్సిడీ కింద అందించే రైతు బంధు పథకం రైతులకు ఆర్థిక భరోసాగా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రైతుబంధు సంబరాలు లో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన రైతు బందు సంబరాలు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుబంధు ద్వారా వానాకాలం యాసంగి ప్రతి ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సహాయాన్ని అందించిన…

  రేపటికల్లా 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య, విద్య శాఖ అధికారులు, ఆర్ డి వో ల ఆదేశించారు. గురువారం నాడు కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో వ్యాక్సినేషన్ పై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒమిమైక్రాన్ వేరియంటూ పిల్లల పైన యొక్క ప్రభావాన్ని చూపుతుందని అందువల్ల 15 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా…

  బాల్కొండ నియోజకవర్గం (నిజామాబాద్) జనవరి 5:– కరోనా మూడవ వేవ్ వచ్చినా ఏ ఒక్క పేదవాడు కూడా ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పలు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలు ఐ సి యు బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు మోర్తాడ్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 5 ఐ…

  రోజుకు 30 వేల చొప్పున జనవరి 7 కల్లా 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ డి వో లు, సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల ప్రకారం 15 సంవత్సరాలు…

2022 నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ని పోలీస్ కమిషనర్ కె.ఆర్ నాగరాజ్, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఇతర అధికారులు, వారి సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నాడు కలెక్టరేట్లో పలువురు అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను కలిశారు. కలెక్టరేట్ ఏవో సుదర్శన్, సిబ్బంది, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి , సంఘ ప్రతినిధులు, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్ ఆయన…

నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు రావాలని, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామని తెలిపారు. భగవంతుని దయవల్ల ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు…