*ప్రచురణార్థం-2* రాజన్న సిరిసిల్ల, జనవరి 12: జిల్లాలో సొసైటీలు ఏర్పాటు చేసి మంజూరయిన మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత ప్రభుత్వ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు 2 వేల మినీ డెయిరీ యూనిట్లు మంజూరయినట్లు, ఒక్కో యూనిట్ ధర…

*ప్రచురణార్థం-1* రాజన్న సిరిసిల్ల, జనవరి 12: క్రొత్తగా ఓటరు జాబితాలో నమోదు చేసిన ఓటర్లకు ఓటరు (ఎపిక్) కార్డులు ఈ నెల 25 న జరుపుకొనే జాతీయ ఓటరు దినోత్సవం రోజున అంద చేయాలని చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ ఓటరు దినోత్సవం, నూతన ఓటరు జాబితా మున్నగు అంశాలపై బుధవారం జిల్లా ఎన్నికల అధికారులతో సిఇఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

*ప్రచురణార్థం-1* రాజన్న సిరిసిల్ల, జనవరి 11: రైతును రాజుగా చూడాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేటలో గల జిల్లా రైతువేదికలో నిర్వహించిన రైతుబంధు సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తుందని అన్నారు. రైతుల శ్రేయస్సు కోరి పంట పెట్టుబడి సహాయం కింద ఇప్పటివరకు 8 విడతల్లో రైతుబంధు…

*ప్రచురణార్థం-3* *వేములవాడ బస్టాండ్, పార్కింగ్ స్థలాల్లో ప్రత్యేకంగా కోవిడ్ పరీక్షల నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి* *ఆలయ సిబ్బంది అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలి* *కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలి* *రెవెన్యూ, ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్* రాజన్న సిరిసిల్ల, జనవరి 10: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వేములవాడ ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించేలా ఆలయ అధికారులు సూచించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం…

*ప్రచురణార్థo-2 *నాటిన ప్రతీ మొక్క సంరక్షించేలా తగిన చర్యలు చేపట్టాలి* రాజన్న సిరిసిల్ల, జనవరి 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా 2022-23 సంవత్సరానికి సంబంధించి జిల్లా యొక్క లక్ష్యం నిర్దేశించుటకు గాను ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అటవీ శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల శాఖల జిల్లా స్థాయి అధికారులతో…

*ప్రచురణార్థం ::1* రాజన్న సిరిసిల్ల, 10 జనవరి, 2022 పోతిరెడ్డిపల్లె రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లోని 20 హెక్టార్లలో నిర్మిస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామ శివారులోని పోతిరెడ్డిపల్లె రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లో నిర్మిస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సంబంధిత అటవీ శాఖ అధికారులతో కలిసి సందర్శించి, నిర్మాణ పనుల పురోగతిని…

*ప్రచురణార్థం-2* రాజన్న సిరిసిల్ల, జనవరి 07: ప్రజా ఫిర్యాదులు, రెవెన్యూ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి మండల తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులను మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ప్రీమెట్రిక్…

*ప్రచురణార్థం-1* రాజన్న సిరిసిల్ల, జనవరి 07: కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్-19 ఉధృతి దృష్ట్యా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో కోవిడ్ నియంత్రణకై 270 సర్వీలెన్స్ టీములను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 255 గ్రామ స్థాయి,…

*ప్రచురణార్థం-2* రాజన్న సిరిసిల్ల, జనవరి 06: పట్టణ అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అధికారులతో పట్టణ అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేములవాడ పట్టణంలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం అప్పగించినట్లు, స్థలంలో ఉన్న రెండు పాత ఆర్సీసి స్లాబ్…

*ప్రచురణార్థం-1* రాజన్న సిరిసిల్ల, జనవరి 06: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, పాఠశాలల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం కలెక్టర్ గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ దశలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాల నూతన భవనం పనులు త్వరితగతిన పూర్తయ్యేలా…