రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కోవిడ్ నిబంధనలను పాటిస్తు గణతంత్ర దినోత్స వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం లభించినదని, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన భారత రాజ్యాంగం జనవరి 26,1950 అమలులోకి…

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదేనని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కోర్టు హాల్లో 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ‘భారత దేశ పౌరుల మైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసం తో మన దేశ…

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులను ఎంపిక చేసి దళితబంధు అమలు అయ్యేలా చూడాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం దళిత బంధు పథకం అమలు పై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా…

ఇంటింటి ఆరోగ్యం సర్వే నిర్వహించాలని, వాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయుటకు వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలనీ రాష్ట్ర ఆర్యోగ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్లకు, వైద్య అధికారులకు సూచించారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో, జిల్లా వైద్య అధికారులతో రాష్ట్ర ఆర్యోగ శాఖ మంత్రి తన్నీరు హరీష్…

              ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం లో భాగంగా 2022 జనవరి ఒకటవ తేదీ నాటికి          18 సం.లు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డు) బి.ఎల్.ఓ.ల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్ లకు సూచించారు.             బుధవారం హైద్రాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో…

ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను తు.చా తప్పకుండా పాటిస్తూ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేస్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపు పై మంగళవారం రాత్రి అయన హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో, ఉద్యోగుల నుండి తీసుకునే ఆప్షన్,…

జిల్లాలో రెండవ డోస్ వాక్సినేషన్  వందశాతం జరిగేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో కోవిడ్ వాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్ పై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజ‌ర‌య్యారు. కోవిడ్ మొదటి, రెండవ దశలో బాగా పని చేసిన వైద్య విభాగం వారికి, మునిసిపల్, పంచాయతీ రాజ్, పోలీస్ శాఖల వారికి …

యాసంగిలో వరి పంట వేయవద్దని వరికి ప్రత్యామ్నయ పంటలు వేసి లాభపడాలని రైతులకు అవగహన కల్పించిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్. సోమవారం మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ జంగమ్మ, జనిగే కృష్ణ, బాలయ్య రైతులను పొలాల వద్ద కలిసి మాట్లాడుతూ భారత ప్రభుత్వం,భారత ఆహార సంస్థ (FCI) వరి ధాన్యం కొనుగోలు చేయదని స్పష్టం చేసినందున ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నయ పంటలు వేయాలని, కూరగాయలు పండించాలని సూచించారు.…

జిల్లాలో రెండవ డోస్ వాక్సినేషన్ వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వైద్య అధికారులకు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సూచించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయ కోర్ట్ హాలులో వాక్సినేషన్ పై వైద్య అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అదక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతు జిల్లాలో గ్రామాల వారీగా వాక్సినేషన్ రెండవ డోస్ వంద శాతం పూర్తి అయ్యేలా, సబ్ సెంటర్ల వారీగా కార్యాచరణ…

యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయ కోర్ట్ హాలులో వ్యవసాయ శాఖ అధికారులతో యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు పై కలెక్టర్ అమోయ్ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ,భారత ఆహార సంస్థ (FCI) ఇకముందు వరి ధాన్యం కొనుగోలు చేయదని…