2021-2022 సంవత్సరానికి పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని కోర్ట్ హాలులో మార్కెటింగ్ , వ్యవసాయ శాఖ , జిన్నింగ్ మిల్లుల యజమానులు , పోలీస్ శాఖ , రవాణా శాఖధికారులతో 2021-22 సంవత్సానికి చేయాల్సిన పత్తి కొనుగోలుపై సమావేశం నిర్వహించారు . ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పత్తి…

రంగారెడ్డి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లాఅదనపు కలెక్టర్ తిరుపతి రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కోర్టు హాలులో నెహ్రు యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ…

రక్త దానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసినట్లని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని కోర్ట్ హాలులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్త దానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను నిలపడమే కాకుండా అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. రక్త నిధి కేంద్రాలు , డయాగ్నోస్టిక్ సెంటర్లను…

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని పెంచేందుకు పుట్టింటి కానుకగా ఆడబిడ్డలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందిస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గము కందుకూరు మండల పరిధిలోని సామ నరసింహ్మ రెడ్డి గార్డెన్ లో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని మహిళల కు చీరలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు…

ఆదివారం రంగారెడ్డి జిల్లా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశమునకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లుతున్నామని, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి…

పేద ఇంటి ఆడపడచులకు పుట్టింటి సారెగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందిస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం తుక్కు గూడ పురపాలక సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  ప్రతి పేదింటి ఆడబిడ్డలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పుట్టింటి సారెగా బతుకమ్మ చీరల అందిస్తున్నారు.…

శనివారం మహాత్మా గాంధీజీ 152వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో కలెక్టర్ అమోయ్ కుమార్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అహింస మార్గమును ఎంచుకొని స్వాతంత్ర్యం సాధించారన్నారు. విదేశీ వస్తువులు బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారని మహాత్మా  గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అందరం కలిసి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ తిరుపతి రావు, డిఆర్ఓ…

రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి తీగల అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 3 (ఆదివారం) రోజున ఉదయం 11 గంటలకు జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో దిలిప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

రంగారెడ్డి  జిల్లాలోని వ్యాపారస్థులు తాము తయారు చేసిన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్ లో ఎగుమతి చేసి స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని రాష్ట్ర  పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్  తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్ లోని జిల్లా  ప్రజా పరిషత్తు   కార్యాలయంలో జిల్లా పరిశ్రమ ల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగుమతి దారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు రాష్ట్ర పరిశ్రమల డైరెక్టర్ కృష్ణ భాస్కర్…

నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో 20 లక్షల రూపాయల తో నిర్మించిన పల్లె ప్రకృతి వనం,పిల్లల ఆట స్థలము,ఆరున్నర లక్షల రూపాయల తో ఏర్పాటు చేసిన కంటైనర్ గ్రంథాలయం ఆరు లక్షల పై చిలుకు నిధుల తో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు,25 లక్షలతో గుంతను…