ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుందామని జిల్లా కలెక్టర్ శ్రీ పి. వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ మీటింగ్ హల్ జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజల వినతులు, ఫిర్యాదులను ఆయన అదనపు కలెక్టర్ శ్రీ ముజమ్మీల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో చెన్నయ్యలు స్వీకరించారు. మొత్తం 122కి పైగా దరఖాస్తులు రాగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భూ సంబంధిత…

డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, వేగంగా జరగాలి -ఇండ్లు లేని నిరుపేద లే ప్రామాణికంగా ఎంపిక ఉండాలి – సిద్దిపేట పట్టణం లో మంజూరైన 1000 ఇండ్లకు వెంటనే టెండర్ లు ఫైనలైజ్ చేయాలి జిల్లాలో వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలో ఇండ్ల నిర్మాణం…

– దరఖాస్తులకు అక్టోబర్ 20 వ తేదీ తుది గడువు గిరిజన సంక్షేమ శాఖ అధ్వర్యంలోసిద్ధిపేట జిల్లాలోని నిరుద్యోగ యువతకు హైదరాబాద్ లోని జాతీయ నిర్మాణ సంస్థ(న్యాక్‌) నందు వివిధ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఫిరంగి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. 3 నెలల ఫినిషింగ్‌ స్కూల్‌ ట్రైనింగ్‌  ప్రోగ్రాంలో శిక్షణకు బీటెక్‌/బీఈ(సివిల్‌), సూపర్‌వైజర్‌ స్ట్రక్చర్స్‌కు ఇంటర్‌, ఐటీఐ(సివిల్‌), డిప్లమా(సివిల్‌) పూర్తిచేసి…

సమైక్య పాలనలో కులవృత్తులు నిరాదరణకు గురై గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయ్యిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీ శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు . ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మత్స్యరంగం కుదేలయ్యిందన్నారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కులవృత్తులకు పూర్వవైభవం కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను పరిపుష్టం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ముందుకు సాగుతున్నారని అన్నారు . ఈ క్రమంలోనే…

ఓటరు జాబితా ను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల కు అనుగుణంగా పకడ్భందిగా రూపొందించాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి శ్రీ పి వెంకట్రామ రెడ్డి తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక ఓటరు నమోదు పెండింగ్ ఫారాలు, ఎపిక్ కార్డులు, స్వీప్ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ…

-జిల్లాలో 126 అంగన్వాడీ ఖాళీ పోస్టుల భర్తీ కి చర్యలు -రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఇచ్చే మెరిట్ ఆధారంగా నే ఎంపిక -మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వ మార్గదర్శకాలు,నియమ నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో ఖాళీగా అంగన్‌వాడీ పోస్టులకు ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలో కమిషనర్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక…

సిద్దిపేట రెవెన్యూ డివిజన్ లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల షాప్ లలో రేషన్ డీలర్ల ఎంపిక కోసం సిద్దిపేట పట్టణం కొండ మల్లయ్య గార్డెన్ లో శనివారం నిర్వహించిన రాత పరీక్ష సజావుగా జరిగింది. సిద్దిపేట రెవెన్యూ డివిజన్ మొత్తం 21 చౌక ధరల దుకాణాలలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 270 అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా శనివారం నిర్వహించిన రాత పరీక్షకు 223 మంది అభ్యర్థులు హాజరయ్యారు .…

– సిద్దిపేట పట్టణం కొండ మల్లయ్య గార్డెన్ లో రాత పరీక్ష – మధ్యాహ్నం 03.00 గంటలకు పరీక్ష ప్రారంభం – అభ్యర్థులు హాల్ టికెట్ లు, ఆధార్ తో సకాలంలో పరీక్ష కేంద్రం కు రావాలి – సిద్దిపేట RDO శ్రీ అనంత రెడ్డి సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్ల ఎంపిక కోసం రేపు ( ఈ నెల 18 వ తేదీ శనివారం) సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్ లో…

రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమం పై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు తెలిపారు. ఆదిశగా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని అన్నారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలం గాంధీనగర్ పరిధిలోని కిషన్ నగర్ లో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా…

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి ఆరాధించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో బిసి సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద , 36 వ వార్డు కౌన్సిలర్ ఉదర విజయ ఆధ్వర్యంలో రామరాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో మట్టి విగ్రహల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు…