జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. కరోనా నిబంధనల మేరకు బుధవారం కలెక్టరేట్ నందు గణతంత్ర వేడుకలలో జిల్లా యస్.పి. రాజేంద్ర ప్రసాద్,  అదనపు కలెక్టర్  పాటిల్ హేమంత్ కేశవ్ లతో కలసి ఆయన పాల్గొన్నారు.  ముందుగా పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించి జాతిపిత మహాత్మా గాంధీ, భారత రత్న dr. బి.ఆర్. అంబెడ్కర్ చిత్ర పటాలకు పులా మాలలు వేసిన అనంతరం జాతీయ పతాకాన్ని…

ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర అని, దేశాభివృద్దికి సుపరిపాలన అందించే మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో   జరిగిన  12 వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరైనారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్చగా వినియోగించుకోవాలని అన్నారు. అర్హులైన ప్రతి…

కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని కరోనా ఉధృతిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ సన్నద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ నందు వైద్యాధికారులు అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కోవిడ్-19 సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ లతో…

దివ్యాoగుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట నందు ఐసీడీయస్ శాఖ ఆధ్వర్యంలో దివ్యాoగులకు ఉచిత సహాయ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో యం. పి. బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర దివ్యoగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డిలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తెచుకున్నాక దివ్యఅంగులకు అన్ని రంగాలలో రాణించాలని అలాగే ఆర్ధిక సామాజిక పరిస్థితులు మెరుగుపరచి…

ప్రభుత్వం మహిళకు అన్నివేళలా అండగా ఉంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పట్టణంలో స్వయంగా ఇళ్లకే వచ్చి కల్యాణలక్ష్మీ/షాది ముబారక్ చెక్ లు అందచేస్తుంటే అక్కడి మహిళలు పట్టారని సంతోషంతో తబ్బిబులయ్యారు.పేదల ఇండ్లలో జరుగుతున్న పెండ్లిళ్లకు ఆడపడుచు కట్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన /షాదిముబారక్ చెక్ లు నేరుగా తమ చెంతకే చేరుతుండడంతో నారి లోకం సదరు నేతకు నీరాజనం పట్టింది.ఇంటింటికీ కలియ తిరుగుతూ కాలి నడకన బయలు దేరిన…

కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గ్రామాల వారీగా, వార్డుల వారీగా టీం…

ప్రజలు పలు సమస్యల పై అందచేసిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్  యస్. మోహన్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు.  సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో   ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని, ప్రజావాణిలో  వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను పరిష్కార దిశగా సత్వరమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు .  ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసే ప్రజావాణి…

జిల్లాలో గ్రామీణాభివృద్దే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ నందు నూతన సంవత్సర క్యాలండర్, గోడ పత్రికను పి.డి. డి.ఆర్.డి.ఏ  యస్. కిరణ్ కుమార్ తో కలసి ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్దే దేశాభివృద్దని ఆదిశగా తమ శాఖ ద్వారా జిల్లాలోని  గ్రామ, మండల స్థాయిలలో అమలు అవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు.…

తేదీ.6.1.2022. సూర్యాపేట. విదులలలో సత్వరమే చేరాలి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి. సూర్యాపేట జిల్లాకు సంబంధించి 32 కేటగిరీలలోని 322మంది బోధన, బోధనేతర సిబ్బంది కి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా కలెక్టర్ T . వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో బోధన, బోధనేతర సిబ్బంది ఇచ్చిన వ్యక్తిగత మొబైల్ నెంబర్ కు ఆ ఉత్తర్వులు పంపించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మొబైల్ నంబర్ కు పంపిన ఉత్తర్వులను అధికారిక ఉత్తర్వు గా…

తేదీ.07.1.2022. సూర్యాపేట. కిశోర బాల బాలికలు తప్పక తీసుకోవాలి. పూర్తి స్థాయి అందుబాటులో వ్యాక్సిన్. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి. జిల్లాలో కట్టడికి వ్యాక్సిన్ వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. జిల్లాలో 15 18 సంవత్సరాలలో 53,38 సంవత్సరాలలో కిశోర బాలలకు 3 మంది ముప్పునుండి రక్షణ పొందేందుకు అందరికి అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ అందించారు. జిల్లాలో గ్రామ మండల ఏర్పాటులో 120 టీంలు నిరంతరం పనిచేస్తున్నామని…