వ్యర్ధాలు ఎప్పటికీ వృధా కాబోవు అని వాటినుండి అద్భుతాలు సృష్టించొచ్చు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వృధా అనుకున్న వస్తువుల గురించి ఒక్కసారి లోతుగా అధ్యయనం చేయగలిగితే అదే మరో వస్తువుకు ముడి సరుకుగా మారుతుందని ఆయన తెలిపారు. సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నుండి తయారు చేసిన ఆక్యుపేజర్ బోర్డ్స్,ఇటుకలు,టైల్స్ ను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. వ్యర్థం అనుకున్న దాంట్లో నుండి అద్భుతాలు…

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, టి. హరీష్ రావు లు జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు సూచించారు. మన ఊరు, మన బడి కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆర్థిక శాఖా మంత్రి హరీష్…

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పులు ఎక్కువగా జరగాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు విద్య, వైద్యారోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి అరోగ్య రంగానికి బ‌డ్జెట్‌లో రూ. 11,440 కోట్లు కేటాయించారు. ప్ర‌జ‌ల‌కు అత్యున్న‌త వైద్య సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌ని చేస్తున్న‌దని…

జిల్లాలో నకిలీ విత్తనాలు సరఫరా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా యస్.పి. రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నకిలీ విత్తనాలు సరఫరా జరగకుండా చేపట్ట వలసినవిధానం పై పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, అదనపు యస్.పి. రితి రాజ్ లతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం జరగకండా ముందుగా నకిలీ విత్తనాలు గుర్తించాలని అన్నారు.…

M జిల్లాలో , పది, ఇంటర్మీడియెట్ అలాగే టెట్ పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చే మే, జూన్ మాసాలలో పది, ఇంటర్మీడియెట్ , టెట్ పరీక్షల నిర్వహణ సందర్బంగా చేపట్టవలసిన వివిధ అంశాలపై రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి , విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , కమీషనర్ దేవసేన ఇంటర్మీడియట్…

జిల్లాలో రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు అందచేయాలని బ్యాంక్ అధికారులను అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంక్ అధికారులతో కేంద్ర పథకం కిసాన్ భగీ దారి ప్రాధమిక హమారి క్యాంపియన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కిసాన్ లబ్దిదారులందరికి క్రెడిట్ కార్డులు జారీచేసి పంటల, ఇతర రుణ సదుపాయాలు కల్పించాలని సూచించారు. రైతులు కిసాన్ కార్డులు పొందుటకు తమ పంట సాగు భూమి…

జిల్లాలో ఇంటర్ మీడియేట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఇంటర్ మీడియేట్, అనుబంధ శాఖాధికారుల ను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్ లో ఇంటర్ మీడియేట్ పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ 7180, ఒకేషనల్ 1510 మంది అలాగే రెండవ సంవత్సరం జనరల్ 7498, ఒకేషనల్ 1288 మంది మొత్తం 17476 మంది…

అర్జీదారుల ధరఖాస్తులపై సత్వరమే స్పందించాలని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వివిధ రకాల భూ సమస్యలపై దరఖాస్తులు ఎక్కువగా అందుతున్నాయని ఆయా సమస్యలపై అర్జీదారులు నుండి దరఖాస్తులను స్వీకరించనైనదని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు అట్టి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి లో…

రంజాన్ మాసంలో ఇఫ్తార్ లు ఐక్యతకు నిదర్శనమని మంచి నడవడిక కోసం మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని సుగమం చేసింది ‘ రంజాన్’ మాసమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట లోని జమ్మి గడ్డ , పోస్టాఫీసు పెద్ద మసీదు లలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇఫ్తార్ విందు ‘ లలో ఆత్మీయత సహృద్భావాలు ప్రసుప్టమవుతాయని, పరస్పర ధోరణికి, విశాల ఆలోచనా దృక్పథానికి ఇవి…

    జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర అసంక్రమిత వ్యాధుల అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప అన్నారు. శనివారం రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనూష తో కలసి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గిరి నగర్ , రాజీవ్ నగర్ లను సందర్శించి రికార్డులు , రిపోర్టుల ను పరిశీలించారు. కేంద్రలలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడి స్క్రీనింగ్ వివరాలను తెలుసుకున్నారు. అసంక్రమిత వ్యాధులపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమం నిర్వహించాలని, ఉచిత…