ఈనెల 26, 27 తేదీలలో మరియు , డిసెంబర్ 3 ,4 తేదీలలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమము నిర్వహించాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2023 లో భాగంగా ఈ నెల 26, 27 మరియు డిసెంబర్ 3, 4 తేదీలలో నిర్వహించే ప్రత్యేక క్యాంపేయిన్ లో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ…
డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులను వేగవంతం చేసి జనవరి 15 నాటికి లబ్ధిదారులకు అందజేయాలి… రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను జనవరి, 15 2023 నాటికి లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి అయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి, రెండు పడక గదుల గృహ నిర్మాణం పురోగతి, పోడు భూములు, తెలంగాణ క్రీడా…
పెండింగ్ లో ఉన్న క్రీడా ప్రాంగణం : పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ.
పెండింగ్ లో ఉన్న క్రీడా ప్రాంగణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ ) రాహుల్ శర్మ ఐఏఎస్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్.డి.ఓ కృష్ణన్ తో కలిసి అదనపు కలెక్టర్ పూడూరు మండలం లోని మిర్జాపూర్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం, తడి పొడి చెత్తను వేరు చేసే కేంద్రమును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలోని ప్రాథమిక. పాఠశాలను మరియు అంగన్వాడీ కేంద్రమును…
పోడు భూముల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ నిఖిల.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడు భూముల పరిష్కారానికి అధికార యంత్రాంగం కలిసికట్టుగా పనిచేసి వారం రోజులలో గ్రామసభలు పూర్తి చేసి తీర్మానాల నివేదికలను సబ్ డివిజనల్ లెవెల్ కమిటీకి పంపించాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం పోడు భూములపై కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ సభలు నిర్వహించేటప్పుడు అతి జాగ్రత్తగా ఒత్తిడికి లోను కాకుండా స్క్రూటిని చేయాలన్నారు . చాలామంది…
హరితహారం నర్సరీల నిర్వహణ పటిష్టంగా చేపట్టాలి.. జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ.
నర్సరీల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించి, హరితహారంకు అవసరమైన నాణ్యమైన మొక్కలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హరితహారం నర్సరీల నిర్వహణపై అవగాహన, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పనులు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల పనుల పురోగతిపై మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఏపీవోలతో మండలాల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…
మన ఊరు మనబడి పనులన్నీటిని త్వరితగతిన పూర్తి చేయాలని …జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ .
మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులన్నీటిని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మన ఊరు మనబడి కార్యక్రమం పురోగతిపై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో మన ఊరు మనబడి కింద ఎంపికైన 371 పాఠశాలల్లో ఇప్పటికే పనులు పూర్తయిన అదే విధంగా ఇంకా గ్రౌండింగ్ కానీ పాఠశాల వివరాల గురించి అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. దారూర్…
ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పుకొని ఆర్థికంగా ఎదగాలి: జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ.
ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్, సెర్ప్, డి ఆర్ డి ఓ ఆధ్వర్యంలో పిఎంఎఫ్ఎంఇ పథకం( ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ ) పై అవగాహన, రుణాలు అందించే కార్యక్రమం పై జిల్లా మహిళా సమాఖ్య సభ్యులచే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు…
ప్రతి రైతు నీతిమంతుడు, కష్టజీవి : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ప్రతి రైతు నీతిమంతుడు, కష్టజీవి అని రాష్ట్ర వ్యవసాయ, సహకార మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. బుధవారం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రెండు కోట్ల రెండు లక్షల వ్యయంతో చేపట్టే వివిధ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ , మార్కెట్ కమిటీ చైర్…
రాజీవ్ స్వగృహ ఓపెన్ స్థలం బహిరంగ వేలం
సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారంలో గల రాజీవ్ స్వగృహ ఓపెన్ స్థలం 3.5 ఎకరాలకు పారదర్శకంగా బహిరంగ వేలం వేసి వికరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. హైదరాబాద్ కు చెందిన “జాయ్ వెంచర్స్” వారు అత్యధికంగా ఎకరానికి ఒక కోటి ఆరు లక్షల రూపాయలకు పాట పాడి ఇట్టి స్థలాన్ని చేజిక్కించుకున్నారని తెలియజేశారు. బహిరంగ వేలంలో మొత్తం 40 మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. అనంతరం స్థలాన్ని చేజిక్కించుకున్న…
పట్టు సాగులో రైతులు అధిక లాభాలు పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల.
పట్టు సాగులో రైతులు అధిక లాభాలు పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మూడు రోజులపాటు నవంబర్ 14 నుండి 16 వరకు నిర్వహించే ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ రైతు అవగాహన సదస్సు, రైతు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిఖిల ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వల గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో పట్టు…