Category: Bhadradri-Kothagudem-Photo gallery

శనివారం అశ్వాపురం మండలం, అమ్మగారిపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలనకు హైదరాబాదు నుండి హెలికాఫ్టర్ లో ఇంజినీర్ ఇన్ ఛీఫ్ మురళీధర్రెడ్డి, ఎల్ అండ్ టి సిఈఓ సుబ్రమణ్యంలతో కలిసి మద్యాహ్నం 1.30 గంటలకు విచ్చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇరిగేషన్, ఎల్ అండ్ టి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు వరకు…

శనివారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, డిఈ, ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పారిశుద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి అన్ని మున్సిపాల్టీలో ప్రతి ఇంటి నుండి నూరు శాతం చెత్తసేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెత్త సేకరణ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యమైన అంశమని చెప్పారు. చెత్త సేకరణ ప్రక్రియ ఏవిధంగా జరుగుతున్నదని మున్సిపల్ కమిషనర్లును…

గురువారం హైదరాబాద్ నుండి  కోవిడ్ నియంత్రణకు ఇంటింటి సర్వే నిర్వహణ, వాక్సినేషన్ ప్రక్రియ, ఐసో లేషన్ కేంద్రాలు  ఏర్పాటు తదితర అంశాలపై రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, టీఎస్ ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,  సీఎస్ సోమేశ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని చెప్పారు.అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ ఓ.పి. సేవలు అందించాలని…

. ఇంటింటికి ఆరోగ్యం, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ‘గురువారం కలెక్టరేట్ నుండి మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, తహసిల్దారులు, యంపిఓలు, యంపిడిఓలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమ ప్రాధాన్యతపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని చెప్పారు. ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమాన్ని మండల, పట్టణ ప్రత్యేక అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని చెప్పారు. కరోనా పరీక్షలు నిర్వహణలో, వైద్య చికిత్సలు అందచేయుటలో వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అధైర్య బడకుండా…

గురువారం సర్వే నెంబర్లు ఎక్కని భూ వివరాల జాబితా సేకరణపై రెవిన్యూ అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి వచ్చిన తరువాత భూ లావాదేవీలు అన్ని ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయని, కొన్ని సాంకేతికపరమైన సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అటువంటి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు. ధరణిలో సర్వే నెంబరు ఎక్కని కారణంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయలేకపోయామని అటువంటి సర్వే నెంబర్లు…

బుధవారం నూతన కలెక్టరేట్ భవనంలో కోవిడ్ నియంత్రణ చర్యలు, వాక్సినేషన్ ప్రక్రియ, దళితబంధు, నూతన కలెక్టరేట్, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణ పనులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించి లక్షణాలున్న వ్యక్తులకు హెూం ఐసోలేషన్ కిట్లు అందచేయాలని తెలిపారు. రెండవ విడతలో ముఖ్యమంత్రి దివ్యమైన ఆలోచనతో ఇంటింటి సర్వేలో హెం ఐసోలేషన్ కిట్లు…

మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో రవాణాశాఖ ఆద్వర్యంలో పోలీస్, వైద్య, రహదారులు భవనాల శాఖ, పంచాయతీరాజ్, వైద్య, మున్సిపల్ అధికారులతో జిల్లా స్థాయి రహదారి బద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 67 ప్రాంతాలను ప్రమాదకర బ్లాకులుగా గుర్తించామని, అటువంటి ప్రాంతాల్లో ప్రమాదాల జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ర.భ., పంచాయతీరాజ్, జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రాస్థాయిలో పర్యటించి రక్షణ చర్యలపై నివేదికలు అందచేయాలని చెప్పారు. ప్రమాదాలకు గురైన వ్యక్తులకు అత్యవసర…

సోమవారం కరోనా వ్యాధి వ్యాప్తిపై తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు, ఐసోలేషన్ వార్డులు తదితర అంశాలపై వైద్య, యంపిడిఓలు, యంపిటలు, మున్సిపల్, జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఐసోలేషన్ బెడ్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఈ వారంలో కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నదని. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు…

. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం అనంతరం జిల్లా అధికారుల అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉండేందుకు నీడనిచ్చే చెట్లుతో పాటు అందమైన గార్డెనింగ్ తయారు చేయుటకు కార్యాచరణ తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అలాగే ఆసుపత్రికి చికిత్సలు కొరకు వచ్చే ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేందుకు వీలుగా ఆర్డీ ప్లాంటు నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు అందచేయాలని చెప్పారు. ఆసుపత్రిలో…

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు అన్ని శాఖల జిల్లా అధికారులతో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలను నమోదు చేసినట్లు చెప్పారు. వచ్చిన సమస్యల యొక్క పిర్యాదులను ప్రజావాణి పోర్టల్ నందు అప్లోడ్ చేసి ఆయా శాఖల అధికారులకు తగు చర్యల నిమిత్తం సిఫారసు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చిన పిర్యాదుల యొక్క పరిష్కార స్వభావాన్ని ప్రతి సోమవారం సమీక్షించడం జరుగుతుందని, అధికారులు పరిష్కార నివేదికలతో హాజరు…