Category: Bhadradri-Kothagudem-Press Release

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం లో భాగంగా 2022 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సం.లు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డు) బి.ఎల్.ఓ.ల ద్వారా అందచేయాలని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్  తెలిపారు.  బుధవారం హైద్రాబాద్ నుండి ఎపిక్ కార్డులు జారీ, ఓటు హక్కు వినియోగంపై  స్వీప్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్బంగా సీఈఓ మాట్లాడుతూ నూతన కొత్తగా ఓటరు…

బుధవారం సీతమ్మ బహుళార్ధ సాధక ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల పథకం, పులుసుబొంత ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియ, మెటల్, ఇసుక, సిఏ ల్యాండ్ కేటాయింపు తదితర అంశాలపై రెవిన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్, మైనింగ్, ఏడి, ఎల్ అండ్ టి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతమ్మ సాగర్ పనులను వేగవంతం చేయాలని ఎల్ అండ్ టి అధికారులను ఆదేశించారు. 741 ఎకరాలకు ఈ నెలాఖరు వరకు అవార్డు…

. మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో యాస్పి రేషనల్ అంశాలపై మహిళా శిశు సంక్షేమ, విద్య, వైద్య, డిఆర్డీఓ, ఎల్డిఎం, వ్యవసాయ, పౌర సరఫరాలు, పశు సంవర్ధక , పీఆర్, యాస్పి రేషనల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూట్రిషన్ కేంద్రం ఏర్పాటుకు అత్యవసరంగా ప్రతిపాదనలు అందచేయాలని వైద్యాధికారులకు సూచించారు. ఇల్లందులో ఏర్పాటు చేయనున్న న్యూట్రిషన్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పనకు అంచనా ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పారు. అనిమియాతో…

ఈ నెల 23వ తేదీ న జరుగనున్న పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణపై  మంగళవారం  కలెక్టరేట్ సమావేశపు హాలులో వైద్య, సంక్షేమ, జడ్పి,డీపీఓ డిఆర్డీఓ, విద్య, మున్సిపల్ కమిషనర్ లతో   ‘టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 0-5 సవత్సరాల  లోపు చిన్నారులు 97,522 మంది ఉన్నారని వీరందరికి పల్స్ పోలియో వాక్సిన్ ఇవ్వాలని చెప్పారు.  ఈ నెల జనవరి 23న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లాలోని అన్నీ…

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు సిపిఓ కార్యాలయం ద్వారా తయారు చేయబడిన హాండ్ బుక్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకం రూపకల్పనకు కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.ఈ పుస్తకంలో జిల్లా యొక్క సమగ్ర వివరాలు పొందుపరచడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాస రావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో కోవిడ్ ఆంక్షలు కొనసాగింపు, గణతంత్ర దినోత్సవ వేడుకలు, ముక్కోటి మహోత్సవాలు నిర్వహణ, ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటి, ఇసుక రవాణా తదితర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ర్యాలీలు, బహిరంగసభలు, మత, రాజకీయ, సాంస్కృతిక సామూహిక కార్యక్రమాలు నిర్వహణకు అనుమతి లేదని చెప్పారు. వ్యాధి నుండి సురక్షితంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాద్యతగా మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెప్పారు. ఈ నెల 12న భద్రాచలంలో…

. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు డయల్ యువర్ కలెక్టర్ నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సమస్యలను నమోదు చేసినట్లు ఆయన వివరించారు. పాల్వంచలో పందుల సమస్య అధికంగా ఉన్నదని, పంటలను నాశనం చేస్తున్నాయని, జనావాసాల మధ్య సంచరించడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఫోన్ రాగా తక్షణమే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పారు. జనావాసాలకు దూరంగా పందుల పెంపకం చేపట్టాలని, జనావాసామద్య కాదని తక్షణమే…

. బూస్టర్ డోస్, రెండో డోస్ వ్యాక్సిన్, చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణపై వైద్య సిబ్బందితో సోమవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ 40 ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతున్నట్లు చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్లుతో పాటు 60 సంవత్సరాలు దాటిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు 90 వేల వరకు ఉన్నారని, వీరందరికీ బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. బూస్టర్ డోస్ ఇవ్వాల్సిన వారిలో ఆరోగ్య సిబ్బంది…

గురువారం కలెక్టరేట్ నుండి పోషణలోపం ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సిడిపిఓలు, సూపర్వైజర్లతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం వారిగా తీవ్ర, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న చిన్నారుల జాబితాను తయారు చేయాలని చెప్పారు. అంగన్వాడీలో ఉన్న ప్రతి పిల్లవాడు పోషణలోపం లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని చెప్పారు. గర్భం ధరించిన నాటి నుండి మొదటి వెయ్యి రోజులు అత్యంత ముఖ్యమైనవని, మానసిక, శారీరక ఎదుగుదలకు…

బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో డియంఎఫ్, ఎస్ఈఏ, సిఎస్ఆర్ నిధులు కేటాయింపు, నిర్మాణ పనుల ప్రగతిపై జిల్లా అధికారులు, పరిశ్రమల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలున్న మన జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను జాప్యం చేయొద్దని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గమనించి అధికారులు అంకితభావంతో పనులు పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిధులు కేటాయింపు జరిగినా ఇంకా…