Category: Bhadradri-Kothagudem-What’s Happening

భూ రికార్డ్ ల నిర్వహణ , సమస్యల పరిష్కారంలో దేశానికే ధరణి ప్రాజెక్టు  ఆదర్శంగా నిలిచినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.  ధరణి ప్రాజెక్టు ప్రారంభమై సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో పాత్రికేయుల సమావేశం నిర్వహించి కేక్ కట్ చేసి రెవిన్యూ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.  జిల్లాలో వేగంగా, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం జరిగిందని చెప్పారు. భూ సమస్యల పరిష్కారంనకు పోర్టల్ అందుబాటులోకి తేవడంపై  సీఎం శ్రీ కేసిఆర్ గారికి,…

. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో రెవిన్యూ, పోలీస్, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ అధికారులతో దీపావళి బాణసంచాలు విక్రయాలు నిర్వహణకు లైసెన్సులు జారీ, రక్షణ చర్యలు, స్టోరేజి చేయుట, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31వ తేదీ ఆదివారం లైసెన్సులు మంజూరు కొరకు సంబంధిత ఆర్డీఓలకు ధరఖాస్తులు చేసుకోవాలని సోమవారం నుండి లైసెన్సులు జారీ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సంతోషం మాటున ప్రమాదం…

కోవిడ్-19 వలన మరణించి అనాధలైన 18 సంవత్సరాల లోపు  బాల బాలికలు ఆయా మండల  ఐసిడిఎస్ సూపరువైజర్ ను కానీ  అంగన్ వాడీ టీచర్లను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. తల్లితండ్రుల మృతితో అనాధలైన బాలబాలికలకు ప్రభుత్వo ఆర్ధిక సహాయం కల్పించడం జరుగుతుందని చెప్పారు. కోవిడ్ తో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు  మరణ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మరియు ప్రస్తుతం పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న సంరక్షకులు మరియు ఆధార్ కార్డులను…

గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను కమిటి దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిరుపేదలు అధికంగా నివసిస్తున్న మన జిల్లాకు ప్రభుత్వం వైద్య, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను కమిటీ…

గురువారం డిఆర్డిఓ సమావేశపు హాలులో అటవీ, పంచాయతీ, జడ్బీ, డిఆర్డిఓ, యంపిడిఓ పిఓ, ఏపిఓలతో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ, వర్మికంపోస్టు తయారు, వైకుంఠదామాలు, నర్సరీలు, నిర్వహణ, పల్లె, బృహత్ పల్లెపకృతి వనాలు, హరితహారం, ట్రాక్టర్లు రుణ చెల్లింపులు, సిసి చార్జీలు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యంపిటలు కార్యస్థానాల్లో ఉండాలని చెప్పారు. కార్యదర్శులపై పర్యవేక్షణ లోపం వల్ల పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ, చెత్త సేకరణలో అనుకున్నంత ఫలితాలు రావడం లేదని…

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మల్టీ లెవల్ విలేజ్ డిసిప్లీనరీ టీములు ఏర్పాటు చేయాలని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. మంగళవారం వాక్సినేషన్ ప్రక్రియపై హైదరాబాదు నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు, డిపిఓలు, జిల్లా పరిషత్ సిఈఓలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తగ్గిపోయిందనే బ్రమలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని కానీ వ్యాధి ప్రమాదం పొంచి ఉన్నదని ప్రజలు గమనించాలని చెప్పారు. ఇతర దేశాల్లో…

మంగళవారం సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి హాలు హాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లోరింగ్, విద్యుత్ ఏర్పాటు పనులతో పాటు సీలింగ్ పనులు ప్రత్యామ్నాయ పనులు చేపట్టాలని, పని విభజన చేయడం వల్ల జాప్యానికి తావు లేకుండా నిరంతరాయంగా జరుగుతుంటాయని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ ముందు అందమైన మొక్కలు నాటేందుకు ప్లాంటేషన్ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. కలెక్టరేట్ సముదాయంలోని ఖాళీ ప్రదేశాన్ని అందమైన మొక్కలతో పాటు…

సోమవారం కొత్తగూడెం క్లబ్ లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు నిర్వహించిన రుణ మేళా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో రుణ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రుణ మేళాకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి  కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ రుణాలు  పొందదానికి అవకాశం ఉందని చెప్పారు. తీసుకున్న రుణాలను  సద్వినియోగం చేసుకోవడంతో పాటు తిరిగి సకాలంలో చెల్లింపు చేయాలని చెప్పారు.  రుణాలు సకాలంలో చెల్లించడం వల్ల బ్యాంకు అభివృద్ధితో పాటు ప్రజలకు…

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో వ్యవసాయ, ఉద్యాన, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, విత్తనాభివృద్ధి సంస్థ, మిల్లర్స్, విత్తన డీలర్లలతో యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు సీజన్లు సరిపోను ధాన్యపు నిల్వలు పేరుకుపోయినందున భారత ఆహార సంస్థ యాసంగిలో ఒక్క గింజ ధాన్యాన్ని కూడా రైతుల నుండి కొనుగోలు చేయలేకపోతున్నామని ఖరాఖండిగా చెప్పినందున యాసింగిలో రైతులు ఎట్టిపరిస్థితుల్లో…

సోమవారం నుండి ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా కలెక్టర్ కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి మహిళా కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రంలో 433 మంది విద్యార్థులకు పరీక్షలకు హారజరు కావాల్సి ఉండగా 19 మంది గైర్హాజరయినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో సిసి టివిలు ఏర్పాటు లేనట్లు గమనించిన కలెక్టర్ తక్షణం సిసిటివిలు ఏర్పాటు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ను ఆదేశించారు. కేంద్రంలో ఏమైనా ఇబ్బందులుంటే తక్షణం…