. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో గంజాయి, గుడుంబా నియంత్రణ, ఇసుక రీచ్లు ఏర్పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. గంజాయి, గుడుంబాను ఉక్కుపాదంతో తుదముట్టించాలని ఆయన పేర్కొన్నారు. గంజాయి వల్ల యువత పెడదోవ పడుతున్నట్లు గమనించిన ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచి వేయు విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలని ఆర్డీఓకు, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.…
Category: Bhadradri-Kothagudem-What’s Happening
మండల ప్రత్యేక అధికారులు ప్రతి శుక్రవారం మండల పర్యటనల్లో గుర్తించిన సమస్యలు, పరిష్కారంపై నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల యొక్క దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి, నోట్క్యామ్ యాప్ ద్వారా తీసిన ఫోటోలను పంపాలని చెప్పారు. అధికారుల పర్యటనలకు సంబంధించిన హాజరు వివరాలను అందచేయాలని డిపిఓకు సూచించారు. గైర్హాజదైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో…
ఆహార భద్రతా చట్టాన్ని గ్రామ స్థాయి నుండి జిల్లాస్థాయి వరకు పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిటి చైర్మన్ తిరుమల రెడ్డి తెలిపారు.
శనివారం కలెక్టరేట్ సమావేశపు హాలులో యంపిటిసిలు, సర్పంచ్లు, ఎంపిపిలు, జడ్పీటిసిలు, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, డిఆర్డిఓ, డిఈఓ, ఐసిడిఎస్, వైద్య, మున్సిపల్/ కమిషనర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్, యంపిడిఓలతో ఆహార భద్రత చట్టంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఆహార భద్రతా ఛైర్మన్ తిరుమలరెడ్డి, సభ్యులు భారతి, శారద, ఆహార భద్రతా కో కన్వీనర్ మరియు జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో…
ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు ఎంతో ప్రపంశనీయమని జిల్లా కలెక్టన్ అనుదీప్ తెలిపాడు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందికి మెమెంటోలు అందచేసి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరదలు, వినాయక నిమజ్జనం, అమ్మవారి నిమజ్జన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది జిల్లా ప్రజలకు విశిష్టమైన సేవలు అందించారని చెప్పారు. గోదావరి వరదలు సమయంలో నీట మునిగిన ప్రజలు అనుసరించాల్సిన చర్యలు, వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు జూన్ 24వ తేదీన కమాండెంట్ రాజీన్ కుమార్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల బృందం మన జిల్లాకు విచ్చేసారని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఏ సమయంలో వరద ముంపు సంభవించినా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సంసిద్ధంగా ఉండేవారని చెప్పారు. అత్యవసర సమయాల్లో జిల్లా ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం జిల్లాకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందని, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు ఎంతో అభినందనీయమని ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలిపారు. వరద ముంపు నుండి ప్రజలు సురక్షితంగా బయటపడేందుకు చేపట్టాల్సిన చర్యలపై దుమ్ముగూడెంలో నిర్వహించిన మార్క్ ఎంతో చక్కగా తెలియచేశారని చెప్పారు. మాల్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సూచించిన సలహాలు, సూచనలు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూడటం జరిగిందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రమాదవశాత్తు ఎవరైనా వరదల్లో చిక్కుకున్నా తక్షణమే చేపట్టాల్సిన చర్యలు గురించి తెలియచేయడం జరిగిందని చెప్పారు. పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు జిల్లా యంత్రాంగానికి మాక్షల్ నిర్వహణ చాలా ఉపయోగపడినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు మనో ధైర్యాన్ని నింపి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మేమున్నామని ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది వెన్నంటి ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ఎఫ్ సేవలు మన జిల్లాకు ఎంతో అవసరమని చెప్పారు. అలాగే భద్రాచలం వద్ద గోదావరిలో వినాయక విగ్రహాలు నిమజ్జన సమయంలో భక్తులకు ఎటువంటి ప్రమాదం వాటిల్ల కుండా ఉండాలనే ఆశయంతో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది. సేవలు అందించారని చెప్పారు. అనంతరం మాక్షల్ నిర్వహణ యొక్క ప్రాధాన్యతను తెలియచేయు ఫోటోలతో కూడిన జ్ఞాపికను అందచేశారు. దాదాపు నాలుగు నెలల పాటు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు అందుబాటులో ఉన్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మీ సేవలు జిల్లా ప్రజలకు ఎంతో అవసరమని చెప్పారు. ఈ అభినందన కార్యక్రమంలో ఎన్టీఆర్ఎఫ్ కమాండెంట్ రాజీపుమార్, డిఆర్డీ అశోక చక్రవర్తి, భద్రాచలం | తహసిల్దార్ శ్రీనివాసయాదవ్, ఆర్బి బిక్కులాల్, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరదలు, వినాయక నిమజ్జనం, అమ్మవారి నిమజ్జన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది జిల్లా ప్రజలకు విశిష్టమైన సేవలు అందించారని చెప్పారు. గోదావరి వరదలు సమయంలో నీట మునిగిన ప్రజలు అనుసరించాల్సిన చర్యలు, వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు జూన్ 24వ తేదీన కమాండెంట్ రాజీన్ కుమార్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల బృందం మన జిల్లాకు విచ్చేసారని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఏ సమయంలో వరద ముంపు సంభవించినా…
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి విజయాలను చేకూర్చాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు
. దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. ఊరు, వాడా చిన్నా పెద్దా తేడా లేకుండా తొమ్మిది రోజుల పాటు ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలు చేసి, బతుకులు చల్లగా చూడమ్మా అంటూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటలకు కోలాటాలు, నృత్యాలతో ఎంతో సందడి చేసారని ప్రతి ఒక్కరినీ అభినందించారు. విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని,…
కరోనా మహామ్మారి గండం నుండి మానవాళిని గట్టెక్కించారని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు వైద్య, ప్రజా ప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అభినందించారు.
బుధవారం కొత్తగూడెం క్లబ్బులో వాక్సిన్ ప్రక్రియ, అంటువ్యాధుల నిర్మూలనపై ప్రజాప్రతినిధులకు, వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి నియంత్రణా చర్యల్లో భాగంగా ప్రాణాలను కూడా లెక్కచేయక వైద్య సిబ్బంది సేవలందించారని చెప్పారు. జిల్లాకు వైద్య, నర్సింగ్ కళాశాలలు మంజూరు వల్ల ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కరోనా, డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నియంత్రణలో…
అక్టోబర్ నెలాఖరు నాటికి నూరు శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
బుధవారం కొత్తగూడెం క్లబ్బులో వైద్య శాఖ సిబ్బందితో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నేటి వరకు 65 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగినట్లు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా వ్యాక్సిన్ లక్ష్య ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రాధిమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆశా, ఏయన్ఎమ్ లతో సమీక్ష నిర్వహించి నూరు శాతం వ్యాక్సిన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో ఎవరు వ్యాక్సిన్ వేసుకున్నారో లేదో మనకు…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెలి కన్సల్టేషన్ వైద్య సేవలు ప్రజలకు చాలా ఉపయోగమని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
మంగళవారం ఇల్లందు మండంలంలోని రొంపేడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు కొరకు వచ్చిన ప్రజలను వ్యాధి తీవ్రత, చికిత్సలు అందిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. వివిధ రకాల వ్యాధులతో భాదపడుతున్న ప్రజలకు ప్రత్యేక వైద్యులతో టెలి కన్సల్టేషన్ వైద్య సేవలు అందించేందుకు మంజూరు చేసిన దీవిని వినియోగించకుండా స్టోర్ రూములో పెట్టినట్లు గమనించిన కలెక్టర్ ఉప వైద్యాధికారి డాక్టర్ వినోద్కు ఫోన్ చేసి టివి మంజూరు చేసింది స్టోర్…
జిల్లా కలెక్టర్ అనుదీప్, కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర రావు పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆట పాటలతో కోలాటం ఆడి ఉత్సాహం నింపారు.
మంగళవారం ప్రగతి మైదానంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంగ అద్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా గౌరమ్మ ఉయ్యాల .. బంగారు ఉయ్యాల అంటూ నృత్యం చేస్తూ మహిళతో కోలాటం ఆడారు. తెలంగాణ సంస్కృతి సంప్రాదయాలు కనుమరుగు కాకుండా ఉండాలన్న ద్యేయంతో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడాలేని విదంగా మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆట పాటలతో 9 రోజుల పాటు పండుగని చేసుకుంటున్నామని అన్నారు.…
సమస్యను పరిష్కరించాలని తెలియచేస్తూ ప్రజావాణిలో ఇచ్చిన ప్రతి ధరఖాస్తును పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు
. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల యొక్క వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సంబంధత శాఖల అధికారులకు ఎండార్స్ చేయడం జరిగిందని, అట్టి ప్రజా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేసి పిర్యాదు దారునికి లిఖితపూర్వకంగా తెలిచేయాలని చెప్పారు. కాలయాపన చేయక సమస్య పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని…