Category: Bhadradri-Kothagudem-What’s Happening

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో పోలింగ్ కేంద్రాలు మార్పులు, చేర్పులు, నూతన కేంద్రాలు ఏర్పాటు తదితర అంశాలపై నియోజకవర్గ కేంద్రాల సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముసాయిదా డ్రాఫ్ట్ రోల్ నవంబర్ 1వ తేదీన ప్రకటించడం జరుగుతుందని, తదుపరి అభ్యంతరాలను నవంబర్ 30వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ఓటర్లు నుండి వచ్చిన అభ్యంతరాలను డిసెంబర్ 20వ తేదీ వరకు పరిష్కరించి జనవరి…

. వృద్దాప్య పింఛన్లు కొరకు  57 ఏళ్లు నిండిన వారి  నుంచి పింఛన్ల దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.  ఈ నెల 11వ తేదీ  సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు. వృద్ధాప్య పింఛనుకు మీ సేవ కేంద్రాల్లో  ఉచితంగా దరఖాస్తు చేసుకునే ఆవకాశం ప్రభుత్వం కల్పించిందని,  కొరకు  దరఖాస్తు దారులు…

. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి మున్సిపల్ ఛైర్ పర్సన్స్, మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులతో పారిశుధ్య కార్యక్రమాలు, హరితహారం, బృహత్ పకృతి వనాలు, ట్రీ పార్కులు ఏర్పాటు, టిఎస్ బిపాస్, సమీకృత మార్కెట్లు, వైకుంఠదామాలు నిర్వహణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న స్థలంలో కాకుండా మరొక చోట అదే అనుమతితో భవనాలు నిర్మిస్తే అటువంటి నిర్మానాలను అక్రమ కట్టడాలుగా…

శుక్రవారం కలెక్టర్ చాంబర్ లో ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ అధికారులతో పాటు, ఉపాధి కల్పన, పరిశ్రమలు, ఎల్డీయం, ఆర్టీసి, కొతగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లుతో లైబ్రరరీలు ఏర్పాటు, పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం, పోటీ పరీక్షల మెటీరియల్ ఏర్పాటు,  మౌలిక సదుపాయాలు కల్పన, విద్యార్థులకు  స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు నిర్వహణ,  క్రీడలు నిర్వహణ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి  పేరెంట్స్ కమిటి…

శుక్రవారం కలెక్టర్ చాంబర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా భద్రాచలం శిశు గృహాలో ఉన్న చిన్నారి సాయిపల్లవి (6 సంవత్సరాలు) దత్తత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం ఆన్లైన్ చేసిన దంపతులకు చిన్నారిని దత్తత ఇచ్చినట్లు చెప్పారు. చిన్నారిని బాగా చదివించి మంచి ఉత్తమరాలుగా  తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడే మంచి అధికారిని తయారు చేయాలని ఆయన సూచించారు. చిన్నారి సంరక్షణను మహిళా శిశు సంక్షేమ అధికారులు నిరంతర పర్యవేక్షణ…

విజయగాధ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కంటికి కనబడని సూక్ష్మ క్రిమి కరోనా వైరస్ నుండి మానవాళిని రక్షించాలంటే ఏకైక సాధనం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలనే  ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్  కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది.. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. కోవిడ్ వ్యాధిని సమూలంగా నిర్మూలించి ప్రజల ప్రాణాలను కాపాడుటపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్…

గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి తహసిల్దారులు, నాయబ్ తహసిల్దారులతో గత సమావేశంలోని అంశాలు, భారీ వర్షాలు, వరదల వల్ల మరణించిన వ్యక్తులు, పశువులకు, ఇండ్లు కూలిన కుటుంబాలకు పరిహారం చెల్లింపు, ధరణి, బృహత్ పల్లె పకృతి వనాలు ఏర్పాటుకు మండలాల్లో ఐదు, మున్సిపాల్టీలలో నాలుగు ప్రాంతాల్లో భూములు గుర్తింపు, ప్రభుత్వ భూములు ల్యాండ్ మార్క్ ఆక్రమణలు, అక్రమ ఇసుక, మట్టి రవాణా, మన ఇసుకవాహనం, కోర్టు కేసులు, మీ సేవా కేంద్రాలు నిర్వహణ, రేషన్ దుకాణాలు,…

గురువారం ముల్కలపల్లి మండలంలోని పూసుగూడెం వ్యవసాయ క్లస్టర్ లో 22 లక్షలు, రాజుపేట గ్రామంలో 22 లక్షలతో నిర్మించిన రైతువేదికలు, పొగళ్లపల్లి గ్రామంలో 157.25 లక్షల వ్యయంతో నిర్మించిన 25 రెండు పడక గదుల ఇండ్లు, రాజాపురం, జగన్నాధపురం, నల్లముడి, గుట్టగూడెం గ్రామాల్లో 32. లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలను జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో ఆయన మాట్లాడుతూ రైతులను అభివృద్ధి చేయడమే…

మంగళవారం పాల్వంచ మండలంలో నిర్మించనున్న వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణ స్థలాన్ని రహదారులు, భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.  జరుగుతున్న పనులపై ప్రతి రోజు నివేదికలు అందచేయాలని చెప్పారు. పనులు. ముమ్మరం చేయాలని నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయుటకు రోజు వారి లక్ష్యాలను నిర్దేశించాలన్నారు. భూమి చదును కార్యక్రమం పూర్తి అయినందున సిమెంట్ పనులు చేపట్టాలని చెప్పారు. అనంతరం బూర్గంపహాడ్‌ మండలంలో  కలెక్టర్  ఆకస్మిక సందర్శన నిర్వహించారు. బూర్గంపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర తనిఖీ …

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లుతో పారిశుద్ధ్యం, పట్టణాల్లో పందుల నియంత్రణ చర్యలు, సదరం క్యాంపులు నిర్వహణ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనావాసాల మధ్య పందుల పెంపకంతో వాటి ద్వారా  ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయని, అందువల్ల పందుల పెంచుతున్న యజమానులతో సమావేశం నిర్వహించి జనావాసాలకు దూరంగా పందుల పెంపకం చేపట్టు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పందుల యజమానులతో సమావేశం నిర్వహణ…