Category: Bhadradri-Kothagudem-What’s Happening

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల వినతులు స్వీకరించి, పరిష్కరించేందుకు  అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కారానికి మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తు చేయాలని, వచ్చిన దరఖాస్తులను తహసిల్దార్లు విచారణ నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. సమస్యను తక్షణం పరిష్కరించాలని, పరిష్కారానికి అవకాశం లేకుండా…

బతుకమ్మ చీరెలు పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ సమస్య రాకుండా ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలైన పినపాక, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెంలతో  పాటు వైరా నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జూలూరుపాడు మండలాలకు చీరెలు పంపిణీ కార్యక్రామాన్ని చేపట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు.  భద్రాచలంకు ఐటిడిఏ పిఓ గౌతం, అశ్వారావుపేటకు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇల్లందుకు జడ్పీ సిఈఓ విద్యాలత, కొత్తగూడెం నియోజకవర్గంతో…

. శుక్రవారం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన పాలియేటివ్ కేర్ యూనిట్, వైరాలజీ ల్యాబ్ను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయోభారంతో పాటు ప్రాణాంతకమైన దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడుతూ కనీసం వారి పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. పక్షవాతం, కాన్సర్, మంచం మీద దీన స్థితిలో ఉన్న వ్యక్తులకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. గాయాలు,…

సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం క్లబ్ నందు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ  భద్రాచలం నందు రామాయణ థీమ్ పార్కు ఏర్పాటు, భక్తులకు సౌకర్యాలు కల్పనతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దనున్నట్లు చెప్పారు.  కిన్నెరసానిలో బోట్ షికారు నిర్వహిస్తున్నామని రాష్ట్రములోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని చెప్పారు.  12 కోట్ల రూపాలయతో చేపట్టిన బడ్జెట్…

ఎటువంటి లైఫ్ లాస్ జరగకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న 48 గంటల్లో జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా ఆదివారం సాయంత్రం రెవిన్యూ, మండల ప్రత్యేక అధికారులు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, రహదారులు భవనాలు శాఖ, విద్యుత్, అగ్నిమాపక, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ, యంపిడిఓ, యంపిఓలతో అధిక వర్షాలు వల్ల ప్రజలు, పశువులు, చెరువులు సంరక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై…

పరిశుభ్రత, పచ్చదనంతో పాటు వాల్ పెయింటింగ్స్ లతో శోభిల్లుతోంది. రెండవ విడత హరితహారంలో భాగంగా  కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యాలయ ముందు భాగంలో గ్రీనరీ కోసం క్రోటాన్ మొక్కలతో పాటు నీడను ఇచ్చే  మొక్కలు నాటారు. కార్యాలయంలోకి అడుగుపెట్టగానే పచ్చని వాతావరణం దర్శనమిస్తోంది. హరిత మొక్కల ఆహ్వానం పలికిన అనుభూతి కలుగుతోంది. దీనికి తోడుగా కార్యాలయంలోకి వెళ్లగానే గోడలకు ఇరువైపులా అందమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టి పడే విదంగా  అందమైన,  ఆకర్షణీయమైన వాల్ పెయింటింగ్స్…

 ఐలమ్మ 126 వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశపు హాలు నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఏఓ ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా భూ పోరాటాలు, పేద ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ధీర వనిత ఐలమ్మ అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం, మహిళా చైతన్యానికి ఆమె ప్రతీకగా…

అన్ని శాఖల జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు మరియు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి నోట్ కామ్ యాప్ లో తీసిన ఫొటోలతో నివేదికలు అంద చేయాలని జిల్లా  కలెక్టర్ అనుదీప్ తెలిపారు.  జిల్లా కలెక్టర్ ఆమోదం కొరకు సమర్పించిన వర్క్ బిల్లులకు సంబంధించి కొన్ని లోపాలను గమనించామని, గతంలో  సూచించిన విధంగా చేసిన పని యొక్క ఫోటోగ్రాఫ్‌లను జతచేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల, అన్ని సూచించిన న్ని శాఖల జిల్లా…

శుక్రవారం కొత్తగూడెం శాసనసభ్యులు క్యాంపు కార్యాలయం నందు దళితబంధు పథకం అమలుపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సాయం అందచేస్తున్నామని,  విడతలు వారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింపచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 59 ఉపకులాలకు చెందిన దాదాపు 75 లక్షల దళిత  కుటుంబాలున్నాయని వీరందరికీ రానున్న 15 నెలల్లో దళితబంధు పథకం…

శుక్రవారం కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం నందు ఇంటిస్థలాల క్రమబద్ధీకరణపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటిస్థలాలు క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఇంటింటి సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు ప్రస్తుతం ఉన్న 10 టీములకు   అదనంగా మరో 5 టీములను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో జిఓనెం. 373 ప్రకారం 6400 మందికి క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేశామని తదుపరి 2014 నుండి నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు ఇంటిస్థలాలు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా…