Category: Bhadradri-Kothagudem-What’s Happening

గురువారం రామవరంలోని సత్యసాయి కమ్యూనిటీ హాలు నందు మహిళా శిశు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసోత్సవాల్లో భాగంగా సీమంతాలు, చిన్నారులకు అక్షర అభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిధిగా విచ్చేసి సీమంతం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించే కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పౌష్టిక లోపంతో భాదపడుతున్న గర్భిణీలు, బాలింతలు, చిన్నారులను గుర్తించి బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు…

గురువారం కలెక్టరేట్ నుండి వ్యవసాయ, రెవిన్యూ, అటవీశాఖ అధికారులతో పంటలు నష్టం, అటవీ రెవిన్యూ భూములు రీ కన్సలేషన్, ధరణి, రేషన్ బియ్యం పంపిణీ, రెండు పడక గదులు ఇండ్లు, ధృవీకరణ పత్రాలు జారీ, కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలు ద్వారా ఆర్థిక సాయం అందించుట,  ఓటరు జాబితాలో అభ్యంతరాలు పరిశీలన, నూతన ఓటరు నమోదు ప్రక్రియ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయు…

.  బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లతో హరితహారం, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ, ప్రధాన రహదారులు స్వీపింగ్ యంత్రాలతో పరిశుభ్రం చేయు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివైడర్లు ప్రక్కన ఇసుక పేరుకుపోవడం వల్ల వాహన దారులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నదని స్వీపింగ్ యంత్రాలు వినియోగం ద్వారా పరిశుభ్రం చేయుంచాలని చెప్పారు.   హరితహారంలో కేటాయించిన  లక్షాలను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.  మున్సిపల్ కమిషనర్లు ఉదయమే వార్డులలో…

బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేయుచున్న  వైద్యాధికారులు,  వైద్యులు, స్పెషలిస్టు వైద్యులు, కార్యాలయ సిబ్బందితో వైద్యసేవలు నిర్వహణ, ఆసుపత్రుల్లో  మౌలిక సదుపాయాలు కల్పన, పాల్వంచలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య వృత్తిలో అనుభవజ్ఞులైన మీరు సమయ పాలన పాటించి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పారు. నిరుపేదలు, నిరక్ష్యరాస్యులు అధికంగా ఉన్న మన జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులే పేద ప్రజల…

బుధవారం కలెక్టర్ చాంబర్ నందు డిఆర్ఓ, పంచాయతీరాజ్, గిరిజన ఇంజనీరింగ్ విభాగం, విద్యుత్, డిఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్లుతో రెండు పడక గదుల ఇండ్ల సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలు పూర్తయిన సముదాయాలను ప్రారంభోత్సవాలు నిర్వహించి లబ్దిదారులకు పంపిణీ చేయుటకు జాబితాను సిద్ధం చేయాలని చేయాలని చెప్పారు. విద్యుత్, మంచినీటి సరఫరాతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ జరగాలని చెప్పారు. విద్యుత్ సౌకర్యం కల్పనకు అంచనా నివేదికలు…

మంగళవారం కలెక్టర్ జూలూరుపాడు మండలంలో చేపట్టనున్న సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ పనులు చేపట్టనున్న నేపథ్యంలో రహదారులు, భవనాలు శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే నెలలలో పనులు ప్రారంభించడానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి సిద్దంగా ఉండాలని చెప్పారు. డివైడర్లు మధ్యలో విద్యుత్తు పోల్స్ ఏర్పాటుతో పాటు అందమైన పూల మొక్కలు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు.  మన జిల్లాలోకి ప్రవేశం జూలూరుపాడు నుండి జరుగుతుందని అందంగా తయారు చేయడంతో పాటు స్వాగత బోర్డులు ఏర్పాటు చేయాలని…

. మంగళవారం కొత్తగూడెం క్లబ్బు నందు జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్య, గిరిజనాభివృద్ధి, ఇంటర్మీడియట్ విద్య, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, వైద్య, అటవీశాఖ, మైన్స్ అండ్ జియాలజి, జిల్లా పంచాయతీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధకశాఖపై చర్చ నిర్వహించినట్లు ఆయన చెప్పారు. గ్రామాలు, మండలాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం…

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు జిల్లా అధికారులతో కారుణ్య నియామకాలు తదితర అంశాలపై  సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరణించిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించుటలో అన్ని శాఖల అధికారులు నివేదికలు డిఆర్ఓ కు అందచేయాలని చెప్పారు. మరణించిన ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన ఆర్థికపరమైన బెనిఫిట్స్ తో  పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించుటకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కారుణ్య నియామకాలు…

. సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల వినతులు స్వీకరించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని, పిర్యాదుదారునికి లిఖితపూర్వకంగా లేఖలు వ్రాయాలని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన వినతులు కొన్ని: ఇల్లందు మండలం, కళాసిబస్తీకి చెందిన పోతు శబరీష్ తన తండ్రి శ్రీనివాసరావు చౌకదుకాణపు డీలరుగా పనిచేస్తూ మరణించారని, అట్టి…

శనివారం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దారులు, యంపిడిఓలు, యంపిఓలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 25 వేల మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ దిగ్విజయంగా జరుగుతున్నదని, వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పింస్తుడడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో జిల్లాలో వ్యాక్సిన్ ప్రక్రియ నూటికి నూరు శాతం పూర్తి చేయు విధంగా ప్రతి ఒక్కరు…