Category: Bhuvanagiri Yadadri-Press Release

  శనివారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హలులో వ్యవసాయం ఏ.డి.లు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో వచ్చే వానాకాలం ఖరీఫ్ పంటల సాగుపై తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతు వేదికలలో వ్యవసాయ సాగు పద్ధతులు, నూతన సాంకేతిక విధానాలపై ప్రతి మంగళవారం శుక్రవారం తప్పనిసరిగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, సాగు పద్ధతులపై ఎప్పటికప్పుడు…

శనివారం నాడు జిల్లా కలెక్టర్ బొమ్మలరామారం మండలం లక్ష్మీ తండ గ్రామపంచాయతీలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆ గ్రామంలో స్త్రీలు రక్త హీనత కలిగి ఉండటం, వీరు ప్రసవానికి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవడం జరుగుచున్నందున వీరు ఆడపిల్లలను కనుటకు ఇష్ట పడకపోగా, ఎవరికీ తెలియకుండా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అబార్షన్ చేయించుకోవడం జరుగుతున్నందున, వివాహాలలో కూడా బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్నందున అక్కడి ప్రజలకు, మహిళలకు…

శుక్రవారంనాడు కాన్ఫరెన్స్ హాలులో మండల వారీగా దళిత బంధు పథకాన్ని ఆమె సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సి.హెచ్.కృష్ణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మాన్యా నాయక్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి శ్రీమతి పరిమళా దేవి, జిల్లా ఉద్యానవన అధికారి శ్రీమతి అన్నపూర్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి నర్సింహా, జిల్లా…

శుక్రవారం నాడు భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో 46 లక్షలతో ఏర్పాటు చేసిన 30 పడకల డెడికేటెడ్ పీడియాట్రిక్ సెంటర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విభాగాన్ని, 20 పడకల ఎస్.ఎన్.సి.యు. బేబే కేర్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. తదుపరి ఒక కోటి 25 లక్షలతో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్, రేడియాలజీ విభాగం భవనానికి, 74 లక్షల 50 వేల రూపాయలతో ఆసుపత్రి మరమ్మత్తులు, ఆధునీకరణ, విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,…

గురువారం నాడు తన ఛాంబర్లో స్త్రీ నిధి యాప్ ను జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2021-22 సంవత్సరంలో స్త్రీ నిధి ఋణాల క్రింద 105 కోట్ల 85 లక్షలకు గాను 98 కోట్ల 10 లక్షల 47 వేల రూపాయలు అందించి 92 శాతం ప్రగతి సాధించామని తెలిపారు. దీనిలో డైరీ ఋణాలు 143 యూనిట్లకు గాను ఒక కోటి 33 లక్షల 36 వేల రూపాయలు లబ్దిదారులకు ఇవ్వడం జరిగిందని…

గురువారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాలులో తహశీలుదార్లు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయితీ అధికారులు, ఉపాధి హామీ అధికారులతో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లెప్రకృతి వనాలకు స్థలాల ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు అనువుగా ఎకరం, లేదా ఎకరన్నర స్థల సేకరణ చేపట్టాలని, అలాగే మండలానికి 5 చొప్పున 85 బృహత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటులో భాగంగా ఇప్పటి వరకు 30 స్థలాల సేకరణ పూర్తి అయ్యిందని,…

కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య ఉన్నారు.

శుక్రవారం ఉదయం 11 గంటలకు బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్ని సందర్శిస్తారని, ఉదయం 11.40 గంటలకు భువనగిరి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టీ డయాగ్నస్టిక్ సెంటర్ పనులకు శంకుస్థాపన, 32 పడకల డి.పి.సి.యు., 20 పడకల ఎస్.ఎన్.సి.యు. కేంద్రాలకు ప్ర్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం 12.15 గంటలకు స్థానిక విద్యానగర్ నందు కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గైనకాలజిస్టులు, ఆర్థోపెడిక్ వైద్యులు, డ్రగ్…

పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో 57 ప్రభుత్వ పాఠశాలలు, 3 ప్రైవేట్ పాఠశాలలు పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయని తెలిపారు. ఈ పరీక్షలకు సుమారుగా 9,487 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారని, జిల్లా వ్యాప్తముగా అన్ని పరీక్ష కేంద్రాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారు ORS ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్సకు అవసరమయ్యే మెడికల్ కిట్లతో అందుబాటులో ఉంటారని తెలిపారు. పరీక్షకు హాజరు అయ్యే విద్యార్థులు…

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి), హైదరాబాద్ కార్యాలయం ఎంపానెల్మెంట్ నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలోని సాంస్కృతిక బృందాలు, కళాకారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నాటిక, నృత్య నాటిక, వీధి నాటకాలు, ఫ్లాష్ మాబ్, కాంపొసిట్ బృందాలు, జానపద, సాంప్రదాయ, పౌరాణిక కళలు, మాజిక్, తోలుబొమ్మలాటలు, ఒగ్గుకథ, యక్షగానం, చిందు యక్షగానం, కోయ, ధింస, గోండు, లంబాడ తదితర కళారూపాలు ప్రదర్శించగల తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారులు, గాయకులు, సంగీత…