Category: Bhuvanagiri Yadadri-Photo Gallery

బుధవారం నాడు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఆమె రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి దివ్య, రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా,  ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి శ్రీమతి ప్రియాంక వర్గీస్, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి లతో  కలిసి దళిత బంధు లబ్ధిదారులను కలుసుకొన్నారు. బొల్లారం రాములు గొర్రెల యూనిట్, …

బుధవారం నాడు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని రైతు వేదిక భవనంలో దళిత బంధు లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన  గ్రామ సభలో ఆమె ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్,  రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి దివ్య, రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా,  ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి శ్రీమతి ప్రియాంక వర్గీస్, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా…

మంగళవారం నాడు 12 వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. తొలుత జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు పాత్ర కీలకమని,  అలాంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని సుస్థిరమైన ప్రజాస్వామ్యానికి దోహదపడాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలని, ముఖ్యంగా యువత ఓటు యొక్క ప్రాధాన్యత గుర్తించాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ…

శనివారం దళిత బంధు పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొనగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, దళితుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి…

శుక్రవారం నాడు యాదగిరిగుట్ట మండలం మహబూబ్ పేట్ గ్రామంలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే ను ఆమె పరిశీలించారు. ప్రతి ఇల్లు సర్వే చేసి కుటుంబం లోని అందరి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని, వ్యాక్సిన్ తీసుకున్నది, లేనిదీ నమోదు చేయాలని, లక్షణాలు ఉన్న వారికి వెంటనే ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలని, మందులు వేసుకునే విధానం వివరంగా తెలపాలని, వారి ఆరోగ్య పరిస్థితిని రోజుకు రెండుసార్లు అడిగి తెలుసుకోవాలని, అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించాలని…

గురువారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో రేపటి నుండి చేపట్టబోయే ఇంటింటి ఆరోగ్య సర్వేను ఆమె సమీక్షించారు. ప్రతి ఇల్లు సర్వే చేయాలని, కుటుంబంలోని అందరి ఆరోగ్య పరిస్థితి పరీక్షించాలని, వ్యాక్సినేషన్ తీసుకున్నది, లేనిది వివరాలను నమోదు చేయాలని, లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని, మందులు వేసుకునే విధానం వివరంగా తెలుపాలని, అవసరమైతే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని తెలిపారు. అన్ని ఆస్పత్రులలో కోవిద్ ఓ.పి. సేవలు ప్రారంభించాలని, కోవిద్ కేర్ సెంటర్, ఐసొలేషన్ వార్డులను…

గురువారం నాడు ఆయన రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, టి.ఎస్.ఎం.ఐ.డి.సి. ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుండి ఇంటింటి ఆరోగ్యం సర్వే చేపట్టాలని, మూడు నాలుగు రోజులలో సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు.…

అనంతరం జిల్లా కలెక్టర్ తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామం లోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డ్ షెడ్లను పరిశీలించారు.

బుధవారం నాడు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఉన్న మూడు అంగన్ వాడి కేంద్రాలను, తిరుమలాపురం గ్రామం అంగన్వాడి కేంద్రాన్ని ఆమె సందర్శించి పిల్లల పోషణ స్థితిని గమనించారు. పిల్లలతో ముచ్చటించి ఆటపాటల విద్య పరిశీలించారు. పిల్లలు తమ వయసుకు తగిన ఎత్తు, బరువు ఉండేలా పరిశీలిస్తుండాలని, పోషక ఆహార లోపం లేకుండా పిల్లలు పెరిగే విధానాన్ని గమనించాలని సూచించారు. అంగన్వాడీల లోని న్యూట్రిషన్ గార్డెన్ లను బాగా అభివృద్ధి చేయాలని సిడిపిఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో…

మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో ప్రజావాణి ఫిర్యాదులు, ధరణి పెండింగ్ దరఖాస్తులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా  227  పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని, వాటిని సత్వరంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరణి  సంబంధించి ఆధార్ సీడింగ్, మ్యుటేషన్స్, పిఓబి, పిపిబి, జిపిఏ  తదితర అంశాలకు సంబంధించి 921 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, ప్రణాళికాబద్దంగా దరఖాస్తులను పరిష్కరించాలని,  అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఫిర్యాదుల…