Category: Bhuvanagiri Yadadri-What’s Happening

గురువారం నాడు ఆయన రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, టి.ఎస్.ఎం.ఐ.డి.సి. ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుండి ఇంటింటి ఆరోగ్యం సర్వే చేపట్టాలని, మూడు నాలుగు రోజులలో సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు.…

అనంతరం జిల్లా కలెక్టర్ తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామం లోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డ్ షెడ్లను పరిశీలించారు.

బుధవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ ఉద్యోగుల TRESA డైరీ, క్యాలెండర్, వాల్ క్యాలెండర్ లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఉద్యోగులకు ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల అధ్యక్షులు పి. శ్యాంసుందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణాల బలరాం రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.వెంకట్ రెడ్డి, భువనగిరి డివిజన్…

బుధవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ, తదితర విషయాలపై సూచనలు చేస్తూ, ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు ఓటర్ కిట్ కూడా జాతీయ ఓటర్ దినోత్సవం వచ్చే జనవరి 25 లోగా నూతనంగా నమోదైన ఓటర్లకు అందచేయాలని తెలిపారు. ఓటర్ కిట్ లో వ్యక్తిగత లేఖ, ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ, ఎపిక్ కార్డు కలిగి…

బుధవారం నాడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కె.అమరేందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి, జిల్లా యువజన అధికారి ధనంజనేయులు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి. శ్యాంసుందర్, తదితరులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి…

మంగళవారం నాడు పారిశుద్ధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనులు, పల్లె ప్రగతి పనులు, తదితర అంశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా, కమిషనర్ డా.శరత్ లతో కలిసి ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు, డి.ఆర్.డి.ఓ.లు, డి.పి.ఓ. లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మూడవ దశ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్యం అంశంలో అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, అవసరమైన మేర…

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి గారు ఉద్యోగులను ఉదేశించి మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా అధికారి నుండి క్రింది స్థాయి ఉద్యోగి వరకు కలసి కట్టుగా ఉండి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని, అది ఒక మంచి సాంప్రదాయమని, ఉద్యోగులకు ఏ కష్టం వచ్చిన అండదండగా ఉంటానని, మనమందరం కలిసి జిల్లాను అభివృద్ధిలో పథంలో తీసుక వెళ్ళాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస…

తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో యువజన సర్వీసుల శాఖచే ఏర్పాటు చేయబడిన శిక్షణా కేంద్రంలో విద్యావంతులైన షెడ్యూల్ కులముల నిరుద్యోగ యువతకు జిల్లా షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ద్వారా పూర్తిగా ఉచిత వసతి, వసతి లేకుండా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గార్మెంట్ మేకింగ్ (టైలరింగ్), బ్యూటీషియన్, డోమెస్టిక్ ఎలక్ట్రీషియన్ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని , దీనికి 7వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారికి MS…

గురువారం నాడు జిల్లా మహిళ సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటుచేసిన మహిళా సమాఖ్య 51వ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా సాధికారత దిశలో జిల్లా మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయని, దీనికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నానని, మహిళా సాధికారత దిశగా రాబోయే రోజులలో అన్ని రంగాలలో ముందుండాలని అన్నారు. బ్యాంకు లింకేజీ విషయంలో NPA జీరో…

Dt. 6.1.2022. గురువారం నాడు భువనగిరి పట్టణంలోని విజ్ఞాన్ హై స్కూలులో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు మధ్య గల విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించిన కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు పరిశీలించారు.