Category: Bhuvanagiri Yadadri

సోమవారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై 26 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. వీటిలో రెవిన్యూ శాఖ 16, మత్స్యశాఖ 2, మున్సిపాలిటీ 2, పంచాయితీ శాఖ, మైనారిటీ శాఖ, సహకారశాఖ, భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయితీరాజ్ శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన…

శుక్రవారం నాడు భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో ఈనెల 15 తేదీ నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లలో భాగంగా ఛీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్టుమెంట్ ఆఫీసర్స్, స్క్వాడ్స్క్ కు అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టరు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక తరగతి విద్యార్థుల పట్ల శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఈనెల 15 నుండి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు…

శుక్రవారం నాడు కాన్ఫరెన్స్ హాలులో పదవ తరగతి పరీక్షల ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వచ్చే ఏప్రిల్ 3 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుండి 12.30 గంటల వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను అధికారులు పరస్పర సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లతో నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 267 ఉన్నత పాఠశాలలకు సంబంధించి 51 పరీక్షా కేంద్రాల…

మార్చి 8 తేదీ బుధవారం నాడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వడ్డీ రాయితీ నిధుల పంపిణి కార్యక్రమం భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి రావి భద్రారెడ్డి ఫంక్షన్ హాలులో నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలనతో చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వాలంబనకు, వారి ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నదని తెలుపుతూ,…

  మంగళవారం నాడు ఆమె శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి తో కలిసి భువనగిరి మండలం అనంతారం గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో సిఎస్ఆర్ (కార్పోరేట్ సోసియో రెస్పాన్సిబిలిటీ) క్రింద తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన స్టెమ్ ల్యాబ్ ను ప్ర్రారంభించారు. ల్యాబ్ లోని పరికరాలను, విద్యార్థుల నూతన ఆవిష్కరణలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యదర్శి విద్యార్ధులతో మాట్లాడుతూ, జాతీయ సైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు మంచిగా చదవాలని, సైన్స్ లో…

సోమవారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి 69 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో రెవిన్యూ శాఖ 47, ఇ.డి. ఎస్సి కార్పోరేషన్ 3, ల్యాండ్ రికార్డు 2, విద్యాశాఖ 3, పోలీసు 2, పొల్యూషన్ కంట్రోల్ శాఖ 2, వ్యవసాయశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, నీటిపారుదల శాఖ, జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, మైనారిటీ సంక్షేమం, విద్యుత్, నేషనల్ హైవే, గ్రామీణాభివృద్ధి శాఖ, యాదాద్రి దేవస్థానం…

సోమవారం నాడు భువనగిరి పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ వారి 284 జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ, సేవాలాల్ వారి ఆశయాలను, ఆలోచనలను ప్రతి ఒక్కరూ ఆచరణలో చూపాలని అన్నారు. బంజారా ప్రజలలో మహిళలు సాధికారికంగా ఉండాలని, తండాలలో విద్యాపరంగా ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించుకున్నాక ముఖ్యమంత్రి గిరిజనుల అభివృద్ధికి చాలా చేస్తున్నారని, తండాలను గ్రామ పంచాయితీలుగా…

శనివారం నాడు బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, పాఠశాలలో చక్కగా బోధిస్తున్న ఉపాధ్యాయులకు నా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తి పెరిగేందుకు విద్యా బోధన ఏ విధంగా చేయాలనే విషయంలో అనేక మార్గాల ద్వారా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా స్థానిక సంస్థల అదనపు అసిస్టెంట్…

శుక్రవారం నాడు బీబీనగర్ మండల ప్రజాపరిషత్ పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్నేహిత రెండవ విడుత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సభకు అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టరు స్నేహిత కార్యక్రమాల లక్ష్యాన్ని వివరించారు. బాలల హక్కులను కాపాడడము, వారి సంరక్షణ, బాధ్యతల పట్ల తల్లిదండ్రులకు అవగాహన కలిగించేందుకు గాను గత సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో స్నేహిత మొదటి విడుత కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాలో మొత్తం 26…