మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. మెయిన్ స్టోర్ రూమ్, వార్డుల ను, లేబర్ రూమ్, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం వ్యాక్సినేషన్ పై పి హెచ్ సి డాక్టర్ రాజేందర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో 18 సంవత్సరాలు పైబడిన వారు 15,268 మంది ఉన్నారని, వీరిలో 13 వేల 400 మందికి 90% వ్యాక్సిన్ వేయడం జరిగిందని డాక్టర్ రాజేందర్ తెలిపారు. 12,329 మంది మొదటి…
Category: Bhuvanagiri Yadadri
ఆశా సిబ్బంది స్థాయి నుండి స్పేస్ లో పనిచేసే స్థాయి వరకు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, మీరు శక్తివంతంగా ఉండాలని, కష్ట కాలంలో ఎవరో వచ్చి కాపాడుతారు అనేది దూరం పెట్టాలని, అంగన్వాడి నుండి స్పేస్ లో పనిచేసే వరకు అన్ని రంగాలలో మహిళలు దూసుకెళ్తున్నారని అన్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష లేనప్పుడే, అదే నిజమైన వెలుగు…
ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో ప్రజల నుండి 73 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో 50 ఫిర్యాదులు రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించినవి కాగా, మిగతావి మున్సిపల్, పంచాయతీ, ఇతర శాఖలకు సంబంధించినవి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ఎఓ నాగేశ్వర చారి, అధికారులు పాల్గొన్నారు.
భువనగిరి ఎంపీడీవో కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, అధికారులు.
వయో వృద్ధులను గౌరవించాలని, వారిని కుటుంబసభ్యులు సరిగా చూడకపోయినా, వారి హక్కులకు భంగం కలిగించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
శుక్రవారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వయోవృద్ధుల సంక్షేమ కమిటీ Maintenance and welfare of senior citizens committee సమావేశం నిర్వహించబడింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి మూడు నెలలకు ఒకసారి వయో వృద్ధుల సంక్షేమ కమిటీ సమావేశం ద్వారా వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు సమీక్షించడం, వారి నుండి వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. వయో వృద్ధులు దైవంతో సమానమని, వారిని ఆ…
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లోని పాఠశాల పల్లి గ్రామంలో జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో 653 ప్రైవేట్ రంగ ఖాళీల భర్తీకి 6 ప్రముఖ కంపెనీలైన అపోలో ఫార్మసీ, హెటిరో డ్రగ్స్, నవత రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్, పయనీర్ ఎల్యాబ్స్, స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ హాజరయ్యాయి. గ్రామంలో జరిగిన జాబ్ మేళాలో 96 మంది హాజరయ్యారు. ఇందులో నుండి 20 మంది యువతీ యువకులు వివిధ జాబ్ లకు ఎంపిక కావడం జరిగింది.…
తెలంగాణ ప్రభుత్వం వారు తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పోరేషన్ ద్వారా ఆర్తోపెడికల్, విజువల్, ఇయర్ రింగ్ లోపము కలిగిన దివ్యాంగులకు క్రింది సహాయ ఉపకరణాలను శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది
తెలంగాణ ప్రభుత్వం వారు తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పోరేషన్ ద్వారా ఆర్తోపెడికల్, విజువల్, ఇయర్ రింగ్ లోపము కలిగిన దివ్యాంగులకు క్రింది సహాయ ఉపకరణాలను శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు హాజరై బోనఫైడ్ విద్యార్థులు మరియు నిరుద్యోగులైన ఆర్థోపెడిక్ హ్యాండీక్యాప్డ్ వారికి 17 మంది కి retrofitted మోటార్ వెహికల్స్ మరియు…
రాష్ట్ర ముఖ్య పండుగ బతుకమ్మ పండుగను జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయిలో తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అన్ని చెరువులు, కుంటల వద్ద శుభ్రమైన వాతావరణం కల్పించాలని, అవసరమైన చోట మరమ్మతులు చేయాలని, బతుకమ్మ పండుగలో పోటీలు నిర్వహించి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో బహుమతులు ప్రదానం చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో బతుకమ్మలో పాల్గొనుటకు మహిళా సంఘాలను ఏరియా కోఆర్డినేటర్ల ద్వారా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు నిర్వహించాలని తెలిపారు. …
గ్రామీణ విద్యార్థుల, జిల్లా కాలేజీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ సమావేశం : జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి
Press note. 5.10.2021 గ్రామీణ విద్యార్థుల అభివృద్దే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా కాలేజీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిగ్రీ కళాశాల్లో నైపుణ్యాల కల్పనలో అగ్రగామి ఉంటూ ఉపాధిని అందించే దిశగా గ్రామీణ విద్యార్థుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పనిచేయాలని అన్నారు. జిల్లాలోని…
సక్సెస్ కి బెస్ట్ వెహికల్ సైకిల్, ముల్కలపల్లి విద్యార్థినులకు సైకిళ్ళను బహుకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి
పత్రికా ప్రకటన సక్సెస్ కి బెస్ట్ వెహికల్ సైకిల్ యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి చైతన్య జైని గారు జిల్లాలో బాలిక విద్యను ప్రోత్సహించడానికి మొట్ట మొదటగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముల్కలపల్లి విద్యార్థినులకు స్వయంగా సైకిళ్ళను బహుకరించి ప్రారంభించిన కార్యక్రమాన్ని whatsApp, facebook వంటి వివిధ మాధ్యమాల ద్వారా చూసిన అనేక మంది ప్రేరణపొంది స్వచ్ఛందంగా విద్యార్థినులకు సైకిళ్ళను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనగా తేది 05.10.2021…